రాహుల్ గాంధీకి అస్వస్థత, ఫుడ్ పాయిజన్ అయ్యుండొచ్చని అనుమానం
Rahul Gandhi Unwell: రాహుల్ గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, మధ్యప్రదేశ్‌లోని ర్యాలీకి హాజరు కాలేకపోతున్నారని కాంగ్రెస్ వెల్లడించింది.
![రాహుల్ గాంధీకి అస్వస్థత, ఫుడ్ పాయిజన్ అయ్యుండొచ్చని అనుమానం Rahul Gandhi To Miss Mega INDIA Rally Due to sudden illness Says Congress రాహుల్ గాంధీకి అస్వస్థత, ఫుడ్ పాయిజన్ అయ్యుండొచ్చని అనుమానం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/21/39bab0c54f81bfbb68f3fc56614b3d701713694236265517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rahul Gandhi Unwell: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లో ర్యాలీల్లో పాల్గొనాల్సి ఉన్నా ఆయన హాజరు కావడం లేదని పార్టీ వెల్లడించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఈ విషయం వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నా, ఝార్ఖండ్‌లోని రాంచీలో I.N.D.I.A కూటమి భారీ ర్యాలీలు చేపడుతోంది. ఈ రెండు ర్యాలీలకూ రాహుల్ రాలేకపోతున్నారని కాంగ్రెస్ తెలిపింది. ఫుడ్ పాయిజన్ అయ్యుండొచ్చని భావిస్తున్నారు.
"రాహుల్ గాంధీ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతానికి ఆయన ఢిల్లీ విడిచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆయనకు బదులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాంచీ ర్యాలీలో పాల్గొంటారు. ఆయనే మధ్యప్రదేశ్‌లోని సాత్నాకి కూడా వెళ్తారు"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత
श्री राहुल गांधी आज सतना और रांची में चुनाव प्रचार के लिए पूरी तरह से तैयार थे, जहां INDIA की रैली हो रही है। लेकिन वह अचानक बीमार हो गए हैं और फिलहाल नई दिल्ली से बाहर नहीं जा सकते हैं। कांग्रेस अध्यक्ष श्री मल्लिकार्जुन खरगे जी अवश्य सतना में जनसभा को संबोधित करने के बाद रांची…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 21, 2024
ఈ ర్యాలీల్లో ప్రతిపక్ష కూటమిలోని కీలక నేతలతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ హాజరయ్యే అవకాశాలున్నాయి. వీళ్లతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి భార్య సునీతా కేజ్రీవాల్, ఝార్ఖంఢ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ హాజరు కానున్నారు. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ అరెస్ట్‌లను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతోంది ప్రతిపక్ష కూటమి. దాదాపు 5 లక్షల మంది ఇందులో పాల్గొంటారని అంచనా.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)