Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ! ప్రతిపాదిస్తున్న సీనియర్లు
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Rahul Gandhi to Become LoP: ఊహించని రీతిలో ప్రతిపక్ష కూటమి పుంజుకోవడం వల్ల దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. మొగ్గు పూర్తిగా బీజేపీపై వైపే ఉంటుందని అనుకున్నా ప్రతిపక్షాలూ గట్టిగానే నిలబడ్డాయి. ఇండీ కూటమిలో సంప్రదింపులు, చర్చలు కొనసాగుతున్నాయి. అటు NDA కూటమి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతుని కూడగట్టుకుంటోంది. ఈ క్రమంలోనే లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరుంటారన్న చర్చ ఇండీ కూటమిలో మొదలైంది. మొత్తం సేనను ముందుండి నడిపించిన రాహుల్ గాంధీకీ ఆ అవకాశం దక్కుతుండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. బీజేపీ తరవాత ఎక్కువ సీట్‌లు వచ్చింది కాంగ్రెస్‌కే. అంటే ప్రతిపక్ష హోదా ఈ పార్టీకి వచ్చేసింది. అందుకే ఈ పార్టీకి చెందిన రాహుల్ గాంధీనే ప్రతిపక్ష నేతగా ఉంటారన్న చర్చ మొదలైంది. ABP News సోర్సెస్ ద్వారా కూడా ఇదే తెలుస్తోంది. రాహుల్ గాంధీయే Leader of Opposition (LoP) గా ఎన్నికవుతారని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ సీనయర్ నేతలు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే...కాంగ్రెస్ పార్లమెంటరీ మీటింగ్‌లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ రాహుల్ గాంధీయే ప్రతిపక్ష నేతగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
"నేను ప్రజలను ఓట్లు అడిగింది రాహుల్ గాంధీ పేరు చెప్పుకునే. లోక్‌సభలో ఆయనే ప్రతిపక్ష నేతగా ఉండాలి. ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలంతా ఈ ప్రతిపాదనకు మద్దతునిస్తారని అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఏం నిర్ణయిస్తుందో వేచి చూస్తాం"
- మాణికం ఠాగూర్, కాంగ్రెస్ నేత
I sought votes on the name of my leader, Rahul Gandhi.
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) June 6, 2024
I think he should be the Leader of Congress in the Lok Sabha.
I hope elected Congress MPs also think the same. Let’s see how the Congress Parliamentary Party decides.
We are a Democratic Party 🇮🇳#RahulGandhiVoiceOfIndia pic.twitter.com/pEsSoeDwB8
లోక్‌సభలో ప్రతిపక్ష నేత కావాలంటే కనీసం 55 ఓట్ల మద్దతు కావాలి. 2014లో కాంగ్రెస్‌కి 44 స్థానాలు రాగా 2019లో ఈ సంఖ్య 52కి పెరిగింది. ఈ సారి 99కి చేరుకుంది. అందుకే అందరూ రాహుల్ గాంధీ పేరునే ప్రతిపాదిస్తున్నారు. ఇండీ కూటమి రాణించడంలో రాహుల్ కీలక పాత్ర పోషించారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కే పరిమితమైన ఆయన ఇప్పుడు ప్యాన్ ఇండియా పొలిటీషియన్‌గా పేరు తెచ్చుకున్నారు.
Rahul ji led the campaign frontally. He was the face. He is duty bound to take on the mantle of Lok Sabha parliamentary party leadership. @RahulGandhi cannot take all decisions about himself. Some decisions the party leaders / MPs have to take. Surely will be a unanimous choice.
— Vivek Tankha (@VTankha) June 6, 2024
Also Read: Bird Flu: బర్డ్‌ఫ్లూ సోకిన వ్యక్తి మృతి, ప్రపంచంలోనే తొలి కేసు - WHO ఆందోళన