Rahul Gandhi Italy Trip: ఎన్నికలకు ముందు ఎక్కడికి పోతావు చిన్నవాడా! రాహుల్ గాంధీ ఫారెన్ ట్రిప్!
రాహుల్ గాంధీ మరో విదేశీ పర్యటనకు వెళ్లారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడం కాంగ్రెస్ వర్గాలను అయోమయంలో పడేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి విదేశాలకు పయనమయ్యారు. 2022లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాహుల్ గాంధీ విదేశాల్లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్ గాంధీ బుధవారం విదేశీ పర్యటనకు వెళ్లారు.
వ్యక్తిగతమే..
రాహుల్ విదేశీ పర్యటన వ్యక్తిగత విషయమని, త్వరలోనే తిరిగి వస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సుర్జేవాలా అన్నారు. భాజపా దీనిపై దుష్ప్రచారం చేయొద్దన్నారు. అయితే రాహుల్ విదేశీ పర్యటన విషయాలు మాత్రం సుర్జేవాలా చెప్పలేదు.
Rahul Gandhi is on a brief personal visit. BJP and its media friends should not spread rumors unnecessarily: Congress leader Randeep Surjewala to ANI on reports of Rahul Gandhi traveling abroad
— ANI (@ANI) December 29, 2021
(file photo) pic.twitter.com/qVYpnMnuEu
5 రాష్ట్రాల ఎన్నికలు..
ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంబాజ్లో రాహుల్ జనవరి 3న బహిరంగ సభకు హాజరుకావాల్సి ఉంది. కానీ విదేశీ పర్యటన కారణంగా అది జనవరి 15కు వాయిదా పడింది. ప్రచారం ఆలస్యం కావడం వల్ల ఆ ప్రభావం కాంగ్రెస్ విజయావకాశాలపైనా పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి. అదీ కాకుండా ఎన్నికల ముందు ఇలా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు చేయడం భాజపాకు కలిసివస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
నెలలో రెండోసారి..
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు కూడా రాహుల్ విదేశానికి వెళ్లారు. ఇప్పుడు మరోసారి వెళ్లడంతో నెలలో రెండోసారి రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లినట్లైంది. ఈసారి రాహుల్ గాంధీ.. ఇటలీకి వెళ్లినట్లు సమాచారం.
Also Read: Jammu Kashmir Encounter: కశ్మీర్‌లో కాల్పుల మోత.. 2 ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ముష్కరులు హతం
Also Read: EC Press Conference Highlights: యూపీ ఎన్నికలు యథాతథం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Also Read: Covid 19 Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా వ్యాప్తి.. 1000కి చేరువైన ఒమిక్రాన్ కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.