అన్వేషించండి

Rahul Gandhi PM Residence Dharna 5 Demands: కేంద్రం ముందు రాహుల్ 5 డిమాండ్లు - లేకపోతే మోదీ ఇంటి ముందే ధర్నా కొనసాగింపు - కేంద్రమంత్రి చర్చలు విఫలం!

Rahul Gandhi: ప్రధాని మోదీ నివాసం వద్ద రాహుల్ గాంధీ ఆందోళన తీవ్రం అయింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో చర్చలు విఫలం అయ్యాయి. విద్యార్థుల కోసం కేంద్రం ముందు కాంగ్రెస్ పెట్టిన 5 కీలక డిమాండ్లు ఇవే!

Rahul Gandhi Calls Patriotic Indians PM House March: దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల భవిష్యత్తు, ప్రశ్నాపత్రాల లీకేజీల వివాదంపై రాజకీయ రణరంగం తీవ్రస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం  ఎదుట లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకత్వం ,  వేలాది మంది విద్యార్థులతో కలిసి  రోడ్డుపైనే బైఠాయించి వినూత్న నిరసన చేపట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ప్రధానమంత్రి కార్యాలయ  సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, రాహుల్ గాంధీతో చర్చించారు. అయితే  ఆ  చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని, ఈ పోరాటం ప్రతి భారతీయుడి కుటుంబ గౌరవానికి సంబంధించినదని కాంగ్రెస్ పార్టీ తేల్చిచెప్పింది.

విద్యార్థులపై దాడి భారతీయ కుటుంబాలపై జరిగిన దాడి  

విద్యార్థులపై జరిగిన దాడి ప్రతి భారతీయ కుటుంబంపై జరిగిన దాడిలాంటిదని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో  విమర్శలు గుప్పించారు.  ప్రధాని మోదీ సమాధానం చెప్పకుండా, ఎటువంటి తీవ్ర పర్యవసానాలను ఎదుర్కొనకుండా తప్పించుకోవచ్చని భావిస్తున్నారు.. కానీ ఈసారి అది ఎంతమాత్రం సాధ్యం కాదు. భారతదేశపు విద్యార్థుల గొంతును ఎవరూ తొక్కిపెట్టలేరు. విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుకునే ప్రతీ దేశభక్తుడైన భారతీయుడు ప్రధాని నివాసం ముందు జరుగుతున్న ఈ ధర్నాలో భాగస్వామి కావాలి అని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.

కేంద్రం ముందు ఐదు ప్రధాన డిమాండ్లు 

ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసన విరమించేది లేదని స్పష్టం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ,  ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం ముందు ఐదు కీలక డిమాండ్లను ఉంచాయి 

 మొదటి డిమాండ్: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలపై తక్షణమే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలి.
 రెండవ డిమాండ్: పత్రాల లీకేజీ, పరీక్షల అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి.
 మూడవ డిమాండ్:  నీట్, ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో బాధితులైన అభ్యర్థులందరికీ నష్టపరిహారం ఇవ్వాలి. 
 నాల్గవ డిమాండ్:  లోక్‌సభ , రాజ్యసభల్లో విద్యార్థుల సమస్యలు, పరీక్షల పారదర్శకతపై ప్రధాని సమక్షంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి తక్షణమే చర్చ చేపట్టాలి.
 ఐదవ డిమాండ్: అక్రమాలకు పాల్పడే నిందితులను శిక్షించడంతో పాటు, భవిష్యత్తులో ప్రశ్నాపత్రాల లీకేజీలకు తావులేకుండా కఠినమైన జాతీయ స్థాయి చట్టాన్ని రూపొందించాలి.     

 

ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ పరిసర ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.  వర్షాకాల సమావేశాల వేళ ప్రతిపక్ష నేత స్వయంగా ప్రధాని ఇంటి గేట్ల ముందే ధర్నాకు దిగడంతో ఢిల్లీ పోలీసులు, పారామిలట్రీ దళాలు భారీగా మోహరించాయి.  పార్లమెంట్, మోదీ నివాసం దగ్గర రాకపోకలను బంద్ చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, విద్యార్థుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రకటన చేసినప్పటికీ, విపక్షాలు మాత్రం ప్రధాని నేరుగా వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నాయి.

దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి విద్యార్థి సంఘాలు ఢిల్లీలోని నిరసనకు మద్దతుగా ర్యాలీలు తీస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో యువజన కాంగ్రెస్, విద్యార్థి సంఘాల నాయకులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాస్తారోకోలకు దిగారు. 'విద్యార్థుల ఆక్రోశం కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడిస్తోంది  అని కాంగ్రెస్ పేర్కొనగా, ఈ ఆందోళనలను రాజకీయం చేసి విద్యా వ్యవస్థను దెబ్బతీయాలని కాంగ్రెస్ చూస్తోందని బీజేపీ ప్రతివిమర్శలు గుప్పించింది. రాజధాని వేదికగా సాగుతున్న ఈ పోరు రానున్న రోజుల్లో మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.         

రాహల్ పోరాటానికి తెలంగాణ సీఎం రేవంత్ మద్దతు పలికారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget