Rahul Gandhi Detained: కాంగ్రెస్ నిరసనలతో దిల్లీలో ఉద్రిక్తత- రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్ట్
Rahul Gandhi Detained: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Rahul Gandhi Detained: నిరుద్యోగం, ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీలతో పాటు రాహుల్ గాంధీ దిల్లీలో ఈ నిరసనల్లో పాల్గొన్నారు. విజయ్‌చౌక్ వద్ద రాహుల్ గాంధీ, శశిథరూర్ సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
महंगाई के खिलाफ आवाज़ उठाने...आओ मिलकर साथ चलें।
— Congress (@INCIndia) August 5, 2022
संसद से सड़क तक...भाजपाई नाकामी के खिलाफ।#महंगाई_पर_हल्ला_बोल pic.twitter.com/zWA6P32dYk
పార్లమెంటు బిల్డింగ్ ప్రాంతంలో పార్టీ సభ్యులతో కలిసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ నిరసనలకు నేతృత్వం వహించారు.
విమర్శలు
అంతకుముందు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ నియంతలా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా ప్రజలు నిర్మించుకున్న భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. దిల్లీలో శుక్రవారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీ.
" ప్రజాస్వామ్యం చచ్చిపోతుంటే మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో శతాబ్దాలుగా ఇటుక ఇటుక పేర్చుకుంటూ మనం నిర్మించుకున్న దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేసేస్తున్నారు. ఈ నియంత రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడిన వారిపై దాడులు చేస్తున్నారు. జైలుకు పంపుతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, హింసకు వ్యతిరేకంగా మాట్లాడకుండా విపక్షాల గళం నొక్కడమే వారి ఆలోచన. కేవలం నలుగురు, ఐదుగురు ప్రయోజనాలను కాపాడటం కోసం ఇద్దరు ముగ్గురు వ్యాపారుల సంక్షేమం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. పోరాడుతూనే ఉంటాను. నేను ఎంత పోరాడితే వాళ్లు నాపై అంతలా దాడి చేస్తారు. నాపై దాడి చేయండి. నేను సంతోషంగా స్వీకరిస్తాను. "