News
News
X

Queen Elizabeth II funeral: క్వీన్ ఎలిజబెత్ 2 శవపేటిక వద్ద కుప్పకూలిన గార్డ్- వైరల్ వీడియో!

Queen Elizabeth II funeral: క్వీన్ ఎలిజబెత్ 2 శవపేటిక వద్ద విధులు నిర్వహిస్తోన్న ఓ గార్డ్ ఉన్నట్టుండి కింద పడిపోయిన వీడియో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

Queen Elizabeth II funeral: క్వీన్ ఎలిజబెత్‌ 2 పార్థివదేహాన్ని బకింగ్‌హం ప్యాలెస్‌ నుంచి పార్లమెంట్‌ హౌసెస్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌కు తరలించారు. రాణికి నివాళులర్పించేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. అయితే తాజాగా రాణి ఎలిజబెత్ 2 శవపేటిక వద్ద జరిగిన ఓ ఘటన వైరల్ అవుతోంది.

ఇదీ సంగతి

రాణి ఎలిజబెత్‌ 2 శవపేటిక ఉంచిన వేదిక వద్ద విధి నిర్వహణలో ఉన్న రాయల్ గార్డ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అతని ముఖం నేరుగా నేలను తాకింది. దీంతో అక్కడ ఉన్న వారు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఏమైంది

వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో ఎత్తైన వేదిక కాటఫ్లాక్‌పై శవపేటికను ఉంచారు. కాటఫ్లాక్‌ వేదిక చుట్టూ ప్రత్యేక సైనిక బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అదే సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఓ గార్డ్‌  స్పృహతప్పి కుప్పకూలిపోయాడు. వెంటనే పక్కనున్న భద్రతా సిబ్బంది అతడిని పైకి లేపే ప్రయత్నం చేశారు. ఎక్కువ సేపు నిలబడి ఉండటం వల్ల గార్డ్ కింద పడిపోయినట్లు తెలుస్తోంది.

ఈనెల 19న

మరోవైపు క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలు సెప్టెంబర్‌ 19న నిర్వహించనున్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఇందుకోసం ఈ నెల 17న ఆమె బ్రిటన్ బయల్దేరనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ తెలిపింది.

ఈ నెల 19న క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారు. ఇందుకోసం ఈ నెల 17న ఆమె లండన్ బయలుదేరతారు.                                                       "
-విదేశాంగ శాఖ

క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఈ నెల 19న జరుగుతాయి. దీని కోసం 9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.71 కోట్లు) ఖర్చవుతుందని అంచనా. 

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 (96) ఈ నెల 8న కన్నుమాశారు. తీవ్ర అనారోగ్యానికి గురై రాణి ఎలిజబెత్ 2 కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, సహా యావత్ ఇంగ్లాండ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

రాణి ఎలిజబెత్‌ను గత ఏడాది అక్టోబర్‌ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లోనే ఆమె ఉంటున్నారు. చివరికి అనారోగ్యంతోనే కన్నుమూశారు. 

అత్యధిక కాలం

బ్రిటన్‌కు ఎలిజబెత్ 2 ఏకంగా 70 ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. ఆమె మృతి పట్ల పలువురు దేశాధినేతలు విచారం వ్యక్తం చేశారు. బ్రిటన్‌ రాణి పోరాట యోధురాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బరువెక్కిన హృదయంతో ఆమెకు నివాళులర్పిస్తున్నట్లు ట్విటర్‌లో తెలిపారు. 2015-18లో బ్రిటన్‌ రాణితో జరిగిన సమావేశాలను మోదీ గుర్తు చేసుకున్నారు.

ఆమె మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. భారత్ ఈ నెల 11వ తారీఖున జాతీయ సంతాప దినంగా పాటించింది. 

బ్రిటన్‌ రాజకుటుంబ నిబంధనల ప్రకారం రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు లేదా వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్‌ రాజు/రాణిగా మారిపోతారు. కనుక రాణి ఎలిజబెత్‌ 2 వారసుడిగా మొదటి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ బ్రిటన్‌ రాజుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే పట్టాభిషేకానికి నిర్దేశిత లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నెలలు లేదా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

Also Read: Tamil Nadu Waqf Board: ఆ ఆలయం సహా గ్రామం మొత్తం మాదే: వక్ఫ్ బోర్డు సంచలన ప్రకటన

Also Read: Lakhimpur Kheri Case: 'వెన్నులో వణుకు పుట్టిస్తాం'- గ్యాంగ్ రేప్‌పై యోగి సర్కార్ సీరియస్

Published at : 15 Sep 2022 04:59 PM (IST) Tags: Viral video Queen's funeral Royal guard falls on face coffin podium

సంబంధిత కథనాలు

Bangladesh Ferry Accident : బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం, నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి!

Bangladesh Ferry Accident : బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం, నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి!

ABP Desam Top 10, 25 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 25 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

NTR District News : ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, చిన్నారి ప్రాణం తీసిన ఉయ్యాల!

NTR District News : ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, చిన్నారి ప్రాణం తీసిన ఉయ్యాల!

Visakha YCP Leaders: విశాఖను రాజధాని చేసేందుకు ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధం- ఉత్తరాంధ్ర నాయకులు

Visakha YCP Leaders: విశాఖను రాజధాని చేసేందుకు ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధం- ఉత్తరాంధ్ర నాయకులు

Minister Srinivas Goud:జింఖానా తొక్కిసలాట బాధితులకు అండగా ఉంటాం - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud:జింఖానా తొక్కిసలాట బాధితులకు అండగా ఉంటాం - మంత్రి శ్రీనివాస్ గౌడ్

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల