Queen Elizabeth II Death: ఇకపై బ్రిటన్ నేషనల్ యాంథమ్ మారిపోతుంది, ఎందుకంటే?
Queen Elizabeth II Death: క్వీన్ ఎలిజబెత్ మృతితో బ్రిటన్‌లో ఎన్నో మార్పులు రానున్నాయి.
Queen Elizabeth II Death:
బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 దాదాపు 70 ఏళ్ల పాటు పరిపాలించారు. 1952లో ఆమె సింహాసనంపై కూర్చున్నప్పటి నుంచి ఆమె ఇమేజ్ పెరుగు తూనే వచ్చింది. కొన్ని తరాల పాటు గుర్తుండిపోయే సంస్కరణలూ తీసుకొచ్చారామె. కరెన్సీ కాయిన్స్ నుంచి పాస్‌పోర్ట్స్ వరకూ
ఎన్నో మార్పులు వచ్చాయి. యూకేలోని మిర్రర్ పేపర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చూస్తే...ఎలిజబెత్ మరణంతో యూకేలో ఇంకెన్నో మార్పులు రానున్నాయి. ఆమె అధీనంలోని ఎన్నో విషయాలు ఇప్పటిలా అయితే ఉండవు. ఈ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది.
కామన్‌వెల్త్‌లో మార్పులు:
కామన్‌వెల్త్‌కు ఇన్నాళ్లూ క్వీన్ ఎలిజబెత్-2 అధిపతిగా ఉన్నారు. కామన్‌వెల్త్‌లో ఆఫ్రికా, ఆసియా, అమెరికా, ఐరోపా, పసిఫిక్‌కు చెందిన మొత్తం 54 దేశాలున్నాయి. ఇప్పుడు ఎలిజబెత్ మరణంతో...కొత్త లీడర్ ఆమె స్థానంలోకి రావాలి. అలా అని ఈ పదవిని వారసత్వంగా ఇవ్వరు. ఆయా దేశాల్లోని ప్రభుత్వాల కామన్‌వెల్త్ అధిపతులందరూ కలిసి కొత్త "హెడ్" ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే...ఈ దేశాలన్నీ ఎవరికి కామన్ వెల్త్‌కు కామన్‌గా ఓ హెడ్ అని కాకుండా...ఎవరికి వారే ఓ లీడర్‌ను ఎన్నుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
సంతాపం
యూకేతో పాటు కామన్‌వెల్త్ సభ్య దేశాలన్నింటిలోనూ ఎలిజబెత్-2 రాణి మృతికి సంతాపం తెలుపుతారు. అధికారికంగా సెలవు దినమూ ప్రకటిస్తారు. రాణి అంత్యక్రియలు పూర్తయ్యాక...బ్రిటన్‌లో యూనియన్ జాక్ ఫ్లాగ్‌ను సగమే ఎగరేస్తారు. మోనార్కీ పాలన లేని దేశాల్లోనూ రాయల్ సాండర్డ్‌కు గౌరవంగా...జెండాను సగం ఎగరేస్తారు. ఎలిజబెత్ రాణి అంత్యక్రియలకు సంతాపంగా లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌ను క్లోజ్ చేస్తారు. BBC మిగతా కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి కేవలం ఆమె అంత్యక్రియలను మాత్రమే చూపిస్తుంది.
క్యాష్, కాయిన్స్
యూకేలో అన్ని కాయిన్స్, నోట్లపైన క్వీన్ ఎలిజబెత్-2 ఫోటో ఉంటుంది. కింగ్ ఫోటోతో ఇకపై కొత్త కరెన్సీని ముద్రిస్తారు. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పాత కరెన్సీని తీసుకుని దానికి బదులుగా కొత్త కరెన్సీని ఇస్తారు. క్రమంగా పాత కరెన్సీ చెలామణిలో లేకుండా చేస్తారు.
స్టాంప్స్, యూనిఫామ్స్
యూకేలోని రాయల్ మెయిల్ సర్వీస్...ఆ దేశంలోనే అతి పెద్దది. స్టాంప్‌లపైనా ఇన్నాళ్లు ఎలిజబెత్ ఫోటో ఉండేది. ఇకపై ఆ స్టాంప్‌లనూ మార్చి కొత్తవి విడుదల చేస్తారు. క్వీన్ ఎలిజబెత్‌కు సంబంధించిన కిరీటం ఎంబ్లమ్ అక్కడి పోలీస్ ఆఫీసర్లు, మిలిటరీ యూనిఫామ్స్‌పై ఉంటుంది. ఇప్పుడు కొత్త కింగ్ పేరుతో ఈ యూనిఫామ్స్ అన్నింటినీ మార్చేయాల్సి ఉంటుంది.
పాస్‌పోర్ట్స్
అన్ని పాస్‌పోర్ట్స్‌లోనూ క్వీన్ ఎలిజబెత్‌ను కోట్ చేస్తూ "Her Majesty" అని ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మార్చేసి...అక్కడి పాస్‌పోర్ట్‌లపై కొత్త కింగ్ పేరిట కోట్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్ట్‌లు ఎక్స్‌పైర్ అయ్యాకే...ఇది అమల్లోకి వస్తుంది. సిటిజన్ షిప్ జారీ చేసే క్రమంలోనూ "Oath"లో మార్పు రానుంది. ఈ ఇంటర్వ్యూల్లో ఇప్పటి వరకూ Her Majesty అనే బదులు ఇకపై "His Mastery King-3" అని ప్రమాణంచేయాల్సి ఉంటుంది. నిన్న ఎలిజబెత్ క్వీన్ మృతి చెందిన సమయంలోనే...ఇది అమల్లోకి వచ్చింది. అప్పటికే ఇంటర్వ్యూలో ఉన్న వారితో ఇలాగే ప్రమాణం చేయించారని కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు.
I am sitting with my friend who is at his Canadian citizenship ceremony via Zoom. There is a long delay. He was supposed to swear his allegiance to the Queen. I'm guessing they're trying to sort out what to do now.
— Roberto Rocha (@robroc) September 8, 2022
They said it.
— Roberto Rocha (@robroc) September 8, 2022
"Sa majesté le roi Charles III, roi du Canada"
His Mastery King Charles III, King of Canada.
That's the citizenship oath now.
నేషనల్ యాంథమ్
బ్రిటన్ జాతీయ గీతంలోనూ క్వీన్ (God Save the Queen) అనే పదం ఉంటుంది. ఇప్పుడు ఈ పదాన్ని కింగ్‌కు అనుగుణంగా మార్చేస్తారు. అంటే God Save the King అని పాడతారన్నమాట.