అన్వేషించండి

Statue Vandalised: పంజాబ్‌లో కెనడా తరహా ఘటన - జాతినేతకు ఘోర అవమానం

పంజాబ్‌లోని ఓ పార్క్‌లో ఓ స్వాతంత్రసమరయోధుడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

భారత్‌లోనూ కెనడా తరహా ఘటన..

కెనడాలో మహాత్మా గాంధీ విగ్రహంపై అభ్యంతరకర వార్తలు రాయటంపై విచారణ జరుగుతుండగానే అలాంటి ఘటనే భారత్‌లోనూ చోటు చేసుకుంది. పంజాబ్‌లోని బతిండాలో ఓ పబ్లిక్‌ పార్క్‌లో స్వాతంత్రసమరయోధుడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేశారు. గురువారం తెల్లవారు జామున దుండగులు ఈ పని చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రమ్మన్ మండీలోని పబ్లిక్‌ పార్క్‌లో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేయటమే కాకుండా, విగ్రహం తలను ఎత్తుకెళ్లిపోయారు.  రమ్మన్ మండీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ చేపడుతున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

 విగ్రహంపై అభ్యంతరకర రాతలు..

కెనడాలోనూ మహాత్మా గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. ఒంటారియోలోని రిచ్‌మండ్ హిల్ సమీపంలో విష్ణు మందిర్ వద్ద 30 అడుగుల
గాంధీ విగ్రహం ఉంటుంది. గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రహంపై అభ్యంతరకర రాతలు రాశారు. భారతీయులను కించపరిచేందుకే ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశారని అక్కడి అధికారులు భావిస్తున్నారు. "రంగు, జాతి, వయసు, జెండర్ ఆధారంగా వివక్ష చూపించే వారెవరైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించం" అని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. ఈ ఘటన పట్ల భారత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కెనడాలోని ఇండియన్ హై కమిషన్ ఇదే విషయాన్ని ట్వీట్ చేసింది. "ఇండియన్ కమ్యూనిటీ వారిని భయపెట్టాలనే దురుద్దేశంతో చేసిన ఈ పనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కెనడాలోని భారతీయులందరిలోనూ ఇలాంటి ఘటనలు అభద్రతా భావాన్ని పెంచుతాయి. కెనడా ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడాం. విచారణ చేపట్టాలని అడిగాం" అని ట్విటర్‌లో పేర్కొంది. ఈ 5 మీటర్ల ఎత్తైన గాంధీ విగ్రహాన్ని 30 ఏళ్ల కిందట ఏర్పాటు చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
Hyderabad Drugs Party: హైదరాబాద్‌లోని రిసార్టులో డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీం దాడులు.. టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్ 
హైదరాబాద్‌లోని రిసార్టులో డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీం దాడులు.. టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్
IPL 2026లో కొందరు స్టార్ ప్లేయర్లు ఎందుకు ఆడటం లేదు, ఫ్యాన్స్ మాత్రం వెయిటింగ్
IPL 2026లో కొందరు స్టార్ ప్లేయర్లు ఎందుకు ఆడటం లేదు, ఫ్యాన్స్ వెయిటింగ్
2026లో ఎలక్ట్రిక్ కార్ల జాతర: టాటా, టయోటా నుండి విన్‌ఫాస్ట్ వరకు.. మార్కెట్లోకి రానున్న టాప్ 10 ఈవీలు ఇవే!
2026లో ఎలక్ట్రిక్ కార్ల జాతర: టాటా, టయోటా నుండి విన్‌ఫాస్ట్ వరకు.. మార్కెట్లోకి రానున్న టాప్ 10 ఈవీలు ఇవే!

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: హైకోర్టు కీలక ఆదేశాలు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: హైకోర్టు కీలక ఆదేశాలు
PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Chandrababu Amaravati Review: అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
IPL 2026లో కొందరు స్టార్ ప్లేయర్లు ఎందుకు ఆడటం లేదు, ఫ్యాన్స్ మాత్రం వెయిటింగ్
IPL 2026లో కొందరు స్టార్ ప్లేయర్లు ఎందుకు ఆడటం లేదు, ఫ్యాన్స్ వెయిటింగ్
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Embed widget