అన్వేషించండి

బర్త్‌డే కేక్‌ తిన్న కాసేపటికే వాంతులు, ఫుడ్ పాయిజన్‌తో పదేళ్ల బాలిక మృతి

Girl Dies: పంజాబ్‌లో పదేళ్ల బాలిక బర్త్‌డే కేక్‌ తిని ప్రాణాలు కోల్పోయింది.

Girl Dies After Eating Cake: పంజాబ్‌లో ఓ పదేళ్ల బాలిక బర్త్‌డే కేక్ తిని ప్రాణాలు కోల్పోయింది. ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందింది. ఇంట్లో వాళ్లందరూ ఈ కేక్ తిన్న తరవాత అనారోగ్యానికి గురయ్యారు. ఆన్‌లైన్‌లో ఓ బేకరీ నుంచి కేక్ ఆర్డర్ చేసినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. పదేళ్ల మాన్వి పుట్టిన రోజు వేడుకల్ని చాలా సంతోషంగా చేసుకున్నారంతా. ఆ తరవాత కొద్ది గంటల్లోనే ఈ విషాదం జరిగింది. పుట్టిన రోజు తెల్లారే బాలిక ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన మిగిల్చింది. మార్చి 24వ తేదీన సాయంత్రం 7 గంటలకు కేక్ కట్టింగ్ జరిగింది. 10 గంటల సమయంలో అందరూ ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. మాన్వి నీళ్లు కావాలని అడిగినట్టు ఆమె తాతయ్య చెప్పారు. గొంతు ఎండిపోతోందని పదేపదే నీళ్లు తాగినట్టు వివరించారు. ఆ తరవాత నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం ఆమె ఆరోగ్యం మరీ ఆందోళనకరంగా మారడం వల్ల వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఊపిరి తీసుకోడానికీ ఇబ్బంది పడింది. వెంటనే ఆక్సిజన్ అందించారు. ఆ తరవాత ECG టెస్ట్ చేశారు. ఆమెని కాపాడేందుకు చాలా సేపు ప్రయత్నించారు. కానీ కాసేపటికే బాలిక కన్నుమూసింది. ఈ కేక్‌ పంపిన బేకరీపై కుటుంబ సభ్యులు మండి పడుతున్నారు. వాళ్ల వల్లే బాలిక చనిపోయిందని ఆరోపిస్తున్నారు. బేకరీ ఓనర్‌పై పోలీసులు FIR నమోదు చేశారు. ఆ కేక్ శాంపిల్‌ని టెస్టింగ్‌ పంపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget