ABP Exclusive: మీరు ఖూనీ చేస్తే.. మేం చూస్తూ కూర్చోవాలా?: ప్రియాంక గాంధీ
లఖింపుర్ హింసాత్మక ఘటనతో భాజపా.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.
ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ హింసాత్మక ఘటన, తన అరెస్ట్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఏబీపీ న్యూస్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం, యోగి సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తన కుమారుడు ఆశిష్‌కు ఈ ఘటనకు ఎలాంచి సంబంధం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ తప్పుబట్టారు.
అయితే తాను నిరాహార దీక్ష చేస్తున్నట్లు వస్తోన్న వార్తలను ప్రియాంక గాంధీ ఖండించారు. ఎలాంటి వారెంట్ చూపించకుండా తనను ఇక్కడ నిర్బంధంలో ఉంచినట్లు ప్రియాంక వెల్లడించారు.
గది శుభ్రం..
ప్రియాంక గాంధీని నిర్బంధించిన గది శుభ్రంగా లేకపోయేసరికి.. ఆమె స్వయంగా చీపురుపట్టి ఊడ్చారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ ఘటనతో ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను ప్రియాంక క్లీన్ స్వీప్ చేస్తారంటూ కామెంట్లు పెడుతున్నారు.
#lakhimpurkhiri Priyanka Gandhi's grandmother was PM of India & her father was also PM of India. When she taken into custody by Sitapur Police, started Satyagraha by sweeping the room. #LakhimpurKheriViolence #Lakhimpur #lakhimpur_farmer_massacre pic.twitter.com/u7TniehUCq
— Vijay kumar🇮🇳 (@vijaykumar1305) October 4, 2021