PM Modi on UN Security Council: సముద్ర భద్రత పెంచాలి.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి.. ఐరాసలో ప్రధాని మోదీ
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. సముద్ర భద్రత, వాతావరణ మార్పులు అంశాలపై వర్చువల్‌గా ప్రసంగించారు.
ప్రపంచ దేశాల మధ్య సముద్ర భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం సముద్ర మార్గాల్లో పైరసీ జరుగుతోందని.. తీవ్రవాదులు వీటిని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన మోదీ.. సముద్ర భద్రత, వాతావరణ మార్పులు అంశాలపై వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రపంచ దేశాల మధ్య సముద్ర మార్గంలో వాణిజ్యానికి ఎదురవుతోన్న అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు.
వివిధ దేశాధినేతలు హాజరైన సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సముద్ర భద్రత, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం గురించి ఐదు సూత్రాలను నిర్దేశించారు. సముద్ర మార్గాలు ప్రపంచ దేశాల వారసత్వ సంపదలు అని... వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ సముద్ర మార్గాలను పైరసీ కోసం వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రవాదులు వీటిని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.
Chairing the UNSC High-Level Open Debate on “Enhancing Maritime Security: A Case For International Cooperation”. https://t.co/cG5EgQNENA
— Narendra Modi (@narendramodi) August 9, 2021
సముద్రాల్లో వ్యర్థాలను వేయడం వల్ల కలుషితంగా మారుతున్నాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా చూసుకోవాలని అప్పుడే వాటిని కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు.
Also read: Ambati Audio : ఆ వాయిస్ నాది కాదు.. నాపై కుట్ర..! "సంచలన ఆడియో"పై అంబటి రాంబాబు వివరణ..!
సముద్ర వివాదాలు సమస్యగా మారాయి..
పలు ప్రపంచదేశాల మద్య సముద్ర వివాదాలు ఉన్నాయని ప్రస్తావించారు. ఇవి అడ్డంకులుగా మారి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాల్ విసురుతున్నాయని పేర్కొన్నారు. వీటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సముద్ర మార్గంలో వాణిజ్యం పెరగాలంటే ఈ అవరోధాలు తొలగాలని.. అప్పుడే ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని సూచించారు.
ఏ ప్రధానికీ దక్కని అరుదైన ఘనత..
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఇప్పటివరకు భారత ప్రధాని ఎవరూ అధ్యక్షత వహించలేదు. మొట్టమొదటి సారిగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ అరుదైన ఘనత సాధించారు. ఈ సమావేశంలో సముద్ర మార్గాల భద్రత, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి పలు అంశాలపై మోదీ ప్రసంగించారు. ఇదిలా ఉండగా.. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్య దేశం కాదు. తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతోంది.