అన్వేషించండి

Ambati Audio : ఆ వాయిస్ నాది కాదు.. నాపై కుట్ర..! "సంచలన ఆడియో"పై అంబటి రాంబాబు వివరణ..!

ఓ మహిళతో అంబటి రాంబాబు సరసమైన సంభాషణ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది తన వాయిస్ కాదని అంబటి రాంబాబు ఖండించారు.


అంబటి రాంబాబు ఆడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ క్లిప్‌పై  అంబటి రాంబాబు స్పందించారు. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని..ఓ వీడియో విడుదల చేశారు. తన పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని.. తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గతంలోనూ తనపై ఇలా చేశారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో త్వరలో వెలుగులోకి వస్తుందని ప్రకటించారు. అంబటి రాంబాబు ఓ మహిళతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అయింది. అందులో సుకన్య అనే మహిళ గురించి వాయిస్‌లో అసభ్యంగా మాట్లాడారు. ఆయన అంబటి రాంబాబేనని ఆయనదే వాయిస్ అని కొంత మంది పోస్టింగ్ పెట్టడం ప్రారంభించారు. దీంతో అది వైరల్ అయిపోయింది. అది తన దృష్టికి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు స్పందించారు. తన వాయిస్ కానే కాదన్నారు. 

కుట్రదారుల్ని బయట పెట్టడానికి ఆయన పోలీసులకు కంప్లైంట్ చేశారో లేదో స్పష్టత లేదు. గతంలోనూ ఆయన ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తతో అసభ్యంగా మాట్లాడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఓ టీవీ చానల్ ఆ మాటలను అప్పట్లో విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ మాటలు తనవేనని అంబటి రాంబాబు అప్పట్లో ఒప్పుకున్నారు కానీ.. మొత్తం కుట్ర అని ఆరోపించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆడియోలో మాటలు తనవి కావని మాత్రం చెబుతున్నారు. అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అసలు ఈ ఆడియో ఎక్కడ పుట్టిందో తేల్చే అవకాశ ఉంది. ఇటీవలి కాలంలో అంబటి రాంబాబు ఆడియో టేపులు వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. 

కొద్ది రోజుల కిందట.. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న  వైసీపీ నేత లక్ష్మిపార్వతి పొలంలో ప్రభుత్వం తరపున సబ్సిడీ కింద ఓ బోర్ వేయించడానికి చేసిన ప్రయత్నాల్లో ఆయన అనుచితంగా మాట్లాడినట్లుగా ఆడియో బయటకు వచ్చింది. ఆ ఆడియోపై అంబటి రాంబాబు స్పందించలేదు. దీంతో ఆయనదే వాయిస్ అనుకున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన ఆడియో మరీ దారుణంగా ఉండటంతో ఆయన స్పందించి ఖండించారు. ఈ ఆడియో వెనుక ఉన్న నిజానిజాలు బయటకు వెల్లడి కావాల్సి ఉంది. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫేక్ ప్రచారాలతో సోషల్ మీడియా పోస్టింగ్‌లు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి. వాట్సాప్ చాట్‌లను  ప్రత్యేకంగా క్రియేట్ చేసి... ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. ఈ క్రమంలో ఆడియో టేపులు కూడా అలాగే బయటకు వస్తున్నాయేమో ... పోలీసులే తేల్చాలి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా తనపై జరిగిన కుట్రను అంబటి రాంబాబే బయట పెట్టే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget