అన్వేషించండి

PM Modi Speech: 'వారిది అవినీతి రాజ్యం.. నేడు మాఫియాపై యోగి సర్కార్ ఉక్కుపాదం'

ఉత్తర్‌ప్రదేశ్‌ను గతంలో పాలించిన పార్టీలు అవినీతి, మాఫియాను పెంచి పోషించాయని ప్రధాని మోదీ అన్నారు. అయితే యోగి సర్కార్ మాత్రం మాఫియాపై ఉక్కుపాదం మోపిందన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. కుషీనగర్‌లోని రాజ్‌కియా వైద్య కళాశాల సహా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వాల్మీకి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. 

" వాల్మీకి జయంతి సందర్భంగా కుషీనగర్‌కు ఇలాంటి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటించడం ఆనందంగా ఉంది. రామాయణం ద్వారా ఒక వ్యక్తి అసాధ్యాన్ని సుసాధ్యం ఎలా చేయాలో వాల్మీకి జాతికి తెలియజేశారు.                                         "
-ప్రధాని నరేంద్ర మోదీ

రూ.280 కోట్లకు పైగా ఖర్చుతో ఈ వైద్యకళాశాలను నిర్మిస్తున్నారు. 500 పడకల ఆసుపత్రిగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 2022-23 నుంచి ఏటా 100 మంది విద్యార్థులు ఇందులో ఎంబీబీఎస్ అభ్యసించనున్నారు.

మోదీ స్పీచ్ హైలెట్స్..

  • వైద్యవిద్యను అభ్యసించి డాక్టర్లుగా దేశానికి సేవ చేయాలని తపించే ప్రతి ఒక్కరికి కొత్త విద్యా విధానం అవకాశాన్ని కల్పిస్తోందన్నారు మోదీ. ఈ కళాశాలలో చదివి రాష్ట్రాన్ని పట్టి పీడించే రోగాలకు చికిత్స అందించాలని కోరారు.
  • మౌలిక సౌకర్యాలను కల్పిస్తే పేదలు కూడా పెద్ద కలల్ని కంటారని, ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి కృషి చేస్తారని మోదీ అభిప్రాయపడ్డారు. 
  • టీబీ వ్యాధిని అరికట్టేందుకు ఉత్తర్‌ప్రదేశ్ శక్తి మేర కృషి చేస్తోందన్నారు. 2 ఏళ్లలో 27 లక్షల మందికి శుభ్రమైన తాగు నీరు కనెక్షన్లు అందించామన్నారు.
  • ఇంతకుముందు ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీలు తమ కుటుంబ సౌఖ్యం కోసమే ఆలోచించేవని మోదీ విమర్శించారు. అప్పుడు వారు మాఫియాకు ఇష్టానుసారం అనుమతులిచ్చారని ఆరోపించారు. అవినీతి రాజ్యమేలిందన్నారు. కానీ ఇప్పుడున్న యోగి సర్కార్.. అదే మాఫియాపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. 
  • పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా ఇప్పటివరకు దాదాపు రూ.37 వేల కోట్లు.. ఉత్తర్‌ప్రదేశ్ రైతుల ఖాతాలో జమ చేసినట్లు మోదీ అన్నారు. 
  • ఉత్తర్‌ప్రదేశ్‌ గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం మరో కొత్త పథకాన్ని ఇప్పటికే ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. పీఎం స్వామిత్వ యోజన కింద తాము ఉంటోన్న ఇళ్లకు సరైన హక్కుపత్రాలను అందిస్తామని మోదీ తెలిపారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మూడో అంతర్జాతీయ విమానాశ్రయమైన కుషీనగర్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.

Also Read: Lakhimpur Kheri Case: ఎందుకింత ఆలస్యం..? దీన్నొక అంతులేని కథగా మార్చకండి: సుప్రీం

Also Read: Aryan Khan Bail News: ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు

Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget