(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi UNGA Speech: అఫ్గాన్ ప్రజలకు భరోసా.. పాకిస్థాన్‌కు పరోక్ష హెచ్చరిక.. మోదీ స్పీచ్ హైలైట్స్ ఇవే
ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు చురకలు అంటించారు. అఫ్గానిస్థాన్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఐక్యరాజ్యసమితి 76వ జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్యంపై ప్రశంసలు కురింపించారు. అఫ్గానిస్థాన్ సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
#WATCH | "In the last 1.5 years, the entire world has been facing the worst pandemic in 100 years, I pay tribute to all those who have lost their lives in this deadly pandemic and I express my condolences to their families," PM Narendra Modi addresses 76th Session of UNGA. pic.twitter.com/CvO9FJtiDZ
— ANI (@ANI) September 25, 2021
అఫ్గానిస్థాన్‌పై..
అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మోదీ అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అఫ్గాన్ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయం కాకూడదన్నారు.
పాకిస్థాన్‌కు చురకులు..
#WATCH | PM Modi says at UNGA,"...Countries with regressive thinking that are using terrorism as a political tool need to understand that terrorism is an equally big threat for them. It has to be ensured that Afghanistan isn't used to spread terrorism or launch terror attacks..." pic.twitter.com/YCr85QGMby
— ANI (@ANI) September 25, 2021
Also Read:Sneha Dubey: ఇమ్రాన్‌కు దిమ్మతిరిగే షాక్.. తెల్లబోయిన పాక్.. ఆమె ఎవరో తెలుసా?