అన్వేషించండి

​PM Modi Speech: మీరెంత బురద జల్లితే అంత అందంగా కమలం వికసిస్తుంది - కాంగ్రెస్‌కు ప్రధాని చురకలు

​PM Modi Speech: ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌కు చురకలు అంటించారు.

​PM Modi Speech:

సెక్యులరిజం అంటే ఇది: ప్రధాని 

ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. అదానీ అంశంపై మాట్లాడాలంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నా వాటిని ఖాతరు చేయకుండా మోదీ తనదైన స్టైల్‌లో కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. మోదీ అదాని భాయీ భాయీ అన్న కాంగ్రెస్ నినాదాల మధ్యే మోదీ తన ప్రసంగం కొనసాగించారు. ఇదే సమయంలో సెక్యులరిజం అంటే ఏంటో కొత్త నిర్వచనం ఇచ్చారు. 

"ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు అన్ని వర్గాలకూ అందుతున్నాయి. ఇదే అసలైన సెక్యులరిజం. మాపై చల్లడానికి మీ దగ్గర మట్టి ఉంటే...మా దగ్గర రంగులున్నాయి. మీరెంత బురద జల్లితే అంత గొప్పగా కమలం వికసిస్తుంది. నిజమైన సెక్యులరిజం దిశగా దేశాన్ని నడిపిస్తోంది మా ప్రభుత్వం మాత్రమే" 

ప్రధాని నరేంద్ర మోదీ

ఎన్నో దశాబ్దాలుగా ఈ పార్లమెంట్ వేదికగా ఎంతో మంది మేధావులు, నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని, వారి మాటల్ని ప్రజలు విని గౌరవించారని అన్నారు మోదీ. కానీ..కొందరు సమయం వృథా చేస్తూ అనవసరమైన ప్రసంగాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై పరోక్షంగా విమర్శలు చేశారు. గత ప్రభుత్వం కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయాయని ఎద్దేవా చేశారు. అత్యంత ముఖ్యమైన నీటి సమస్యనూ తమ ప్రభుత్వం పరిష్కరించిందని స్పష్టం చేశారు. వర్షపు నీటిని పొదుపు చేసుకుని వాడుకునేలా ప్రజల్ని ప్రోత్సహించినట్టు వెల్లడించారు. బ్యాంకుల విలీనాన్నీ ప్రస్తావించారు. పేదలకూ బ్యాంకు సేవలు అందే విధంగా సంస్కరణలు చేపట్టినట్టు చెప్పారు. జన్ ధన్ ఖాతాల ద్వారా గ్రామాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. 

సెటైర్లు..

ఇదే సమయంలో గాంధీ కుటుంబంపైనా సెటైర్లు వేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పాలనలో దాదాపు 600 ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టారన్న ఆయన..వాటిలో ఏ ఒక్క పథకానికీ నెహ్రూ ఇంటి పేరుని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. "టోకెనిజం" విధానంలో సమస్యల్ని పరిష్కరించాలని చూశారని విమర్శించారు. 

"కొందరు కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంస్కృత పదాలెందుకని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో నెహ్రూ గాంధీ పేరిట మొత్తం 600 పథకాలు అమల్లోకి వచ్చాయి. నెహ్రూ నిజంగా అంత గొప్ప వ్యక్తే అయితే వాళ్లు (కాంగ్రెస్ పార్టీ) తమ పథకాల్లో నెహ్రూ ఇంటి పేరుని ఎందుకు పెట్టలేదు? ఆయన ఇంటి పేరుని ప్రస్తావించడానికి అంత బెరుకు ఎందుకు? ఇందులో సిగ్గు పడాల్సిందేముంది?" 

ప్రధాని నరేంద్ర మోదీ

శుభసూచకం: మోదీ 

సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోలేదని విమర్శించారు ప్రధాని మోదీ. మన శాస్త్రవేత్తల్ని కించపరిచారని మండి పడ్డారు. దేశం గురించి కాకుండా కేవలం తమ స్వార్థ రాజకీయాల గురించి మాత్రమే ఆలోచించారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచమంతా నివ్వెరపోయేలా డిజిటల్ చెల్లింపుల్లో  భారత్ ముందంజలో ఉందని వెల్లడించారు. ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌...ఇలా ఇద్దరు మహిళల ప్రసంగాలతో మొదలు కావటం శుభసూచకం అని సంతోషం వ్యక్తం చేశారు. 

Also Read: Tripura Polls: ఆపరేషన్ త్రిపురకు రెడీ అవుతున్న బీజేపీ, మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నడ్డా

టాప్ హెడ్ లైన్స్

IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
ABP Desam Top 10, 14 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 14 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
Embed widget