PM Kisan : రైతుల ఖాతాల్లో రూ. 20వేల కోట్లు జమ చేసిన ప్రధాని ! మీ ఖాతాలో పడ్డాయో లేదో ఇలా చూసుకోండి ..
పీఎం- కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ. రెండు వేలను ప్రధాని మోడీ జమ చేశారు. దాదాపు పది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. ఇరవై వేల కోట్లు జమ అయ్యాయి.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ..పీఎం-కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులను రిలీజ్ చేశారు. సుమారు 10.09 కోట్ల మంది లబ్దిదారులైన రైతుల ఖాతాల్లోసుమారు. రూ. 20,946 కోట్లను జమ చేశారు.ఇప్పటివరకు మొత్తం 9 విడతల్లో పీఎం-కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందజేసింది. ఇవాళ పదో విడత నిధులను ప్రధాని రిలీజ్ చేశారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈకార్యక్రమానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, వ్యవసాయ సంస్ధల ప్రతినిధులు హజరయ్యారు.
Also Read: హర్యానాలో ఘోర ప్రమాదం... విరిగిపడిన కొండ చరియలు...శిథిలాల కింద 20కిపైగా వాహనాలు
పీఎం-కిసాన్ పథకం కింద కేంద్రం అర్హులైన రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ. 6,000 చొప్పున మూడు విడతల్లో జమ చేసే పథకామే పీఎం - కిసాన్. 2019లో దీన్ని ప్రారంభించారు. తొలి తొమ్మిది విడతలకు కలిపి మొత్తం లక్షా అరవై వేల కోట్లను రిలీజ్ చేసినట్లు కేంద్రం తెలిపింది. పదో విడతగా ఈ సారి రూ. ఇరవై వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశారు.
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఈ పథకానికి సంస్థాగత భూస్వాములు, ఆదాయ పన్నులు చెల్లించే వారు అర్హులు కాదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రయోజనాలను పొందడానికి, రైతులు తమ ప్రధాని కిసాన్ ఖాతాను తమ ఆధార్ కార్డులకు లింక్ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్ తో లింకు చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ 10వ విడత నగదు జమ చేశారు.
Also Read: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట... 12 మంది మృతి... ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి
రైతులు ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ కార్డును లింక్ చేశారో ఆ బ్యాంక్ బ్రాంచ్ లో జమ చేస్తారు. రైతులు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. అన్నీ కరెక్ట్‌గా ఉంటే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి. వివరాల్లో తప్పులు ఉంటే వెబ్‌సైట్‌లోనే మార్పులు చేసుకునే అవకాశం ఉంది.
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి