Haryana: హర్యానాలో ఘోర ప్రమాదం... విరిగిపడిన కొండ చరియలు...శిథిలాల కింద 20కిపైగా వాహనాలు
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. కొండ చరియలు విరిగిపడి భారీగా వాహనాలు అందులో చిక్కుకున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
హర్యానాలోని బివాని ప్రాంతంలో పెను ప్రమాదం జరిగింది. దాడమ్ మైనింగ్‌లో జోన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో చాలా మంది కూలీలు ప్రమాదంలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. 20కిపైగా వాహనాలు శిథిలాల్లో ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.
హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఒకరిద్దరు చనిపోయినట్టు ప్రచారం జరుగుతోందన్న ఆయన.. ప్రస్తుతానికి అధికారికంగా చెప్పలేమంటున్నారు.
Haryana Agriculture Minister JP Dalal reaches the spot of landslide
— ANI (@ANI) January 1, 2022
Some people have died. I cannot provide the exact figures as of now. A team of doctors has arrived. We will try to save as many people as possible: JP Dalal pic.twitter.com/PGbxZiucH4
ప్రమాదంపై హర్యాన సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. స్థానిక అధికారులతో నిరంతరం చర్చిస్తున్నామని రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతుందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు.
Saddened by the unfortunate landslide accident in Dadam mining zone at Bhiwani. I am in constant touch with the local administration to ensure swift rescue operations and immediate assistance to the injured.
— Manohar Lal (@mlkhattar) January 1, 2022
Also Read: దేశంలో ఆగని ఒమిక్రాన్ విజృంభణ.. భయపెడుతున్న మహారాష్ట్ర పరిస్థితులు
Also Read: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట... 12 మంది మృతి... ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి