By: Ram Manohar | Updated at : 01 Apr 2023 05:11 PM (IST)
భోపాల్ -న్యూ ఢిల్లీ వందేభారత్ ట్రైన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. (Image Credits: ANI)
Bhopal-New Delhi Vande Bharat:
భోపాల్ టు న్యూ ఢిల్లీ ..
మధ్యప్రదేశ్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. భోపాల్ - న్యూఢిల్లీ మధ్య ఈ సర్వీస్ కొనసాగనుంది. రాణి కమలపతి స్టేషన్ నుంచి పచ్చ జెండా ఊపి ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన వందేభారత్ ట్రైన్‌లలో ఇది పదకొండోది. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో తొలి వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి రావడంపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం అవుతుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికీ ఇది పరోక్షంగా ఉపకరిస్తుందని స్పష్టం చేశారు. ఇండియన్ రైల్వేస్ ద్వారా చిన్న చిన్న కార్మికులు దేశంలోని నలుమూలలకూ వెళ్లగలుగుతున్నారని, తద్వారా వాళ్లు ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు వీలవుతోందని అన్నారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్‌లో భాగంగా ప్రతి జిల్లాలోనూ ఔట్‌లెట్‌లు ఏర్పాటవుతున్నాయని, హస్త కళలకూ ప్రాధాన్యత దక్కుతోందని స్పష్టం చేశారు. దేశంలోని రైల్వే స్టేషన్‌లన్నీ కొత్త హంగులతో కళకళలాడుతున్నాయి. చాలా వరకూ స్టేషన్లలో వైఫై సౌకర్యమూ అందుబాటులోకి వచ్చింది. 900 స్టేషన్లలో CCTVలు ఏర్పాటయ్యాయి. వీటికి తోడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు రావడం ఇండియన్ రైల్వేస్ పాపులారిటీని మరింత పెంచింది. క్రమంగా రద్దీ కూడా పెరుగుతోంది. దేశంలోని ఏ మూలకైనా సరే...డిమాండ్ బాగానే ఉంటోంది. ఇలాంటి కీలక తరుణంలో మధ్యప్రదేశ్‌లో వందేభారత్ ట్రైన్ అందుబాటులోకి రావడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.
#WATCH | PM Narendra Modi flags off Bhopal-New Delhi Vande Bharat train at Rani Kamlapati railway station
— ANI (@ANI) April 1, 2023
Madhya Pradesh CM Shivraj Singh Chouhan and Railway minister Ashwini Vaishnaw also present pic.twitter.com/Aclm3FEy0i
"గతంలో మధ్యప్రదేశ్ ప్రజలు కొన్ని రైళ్లను తమ స్టాప్‌ల వద్ద ఆపేలా చూడాలని విజ్ఞప్తి చేసే వాళ్లు. ఆ తరవాత వందేభారత్ ట్రైన్ కావాలని డిమాండ్ చేశారు. వాళ్లు అడిగిన కొద్ది కాలానికే ఇది అందుబాటులోకి తీసుకురావడం నాకు చాలా గర్వంగా ఉంది. రైల్వే ప్రయాణికులకు ఎన్నో కొత్త సౌకర్యాలు కల్పిస్తున్నాం. బడ్జెట్‌లోని రికార్డు స్థాయిలో రైల్వే శాఖకు కేటాయింపులు చేశాం. గత ప్రభుత్వ హయాంలో రైల్వే బడ్జెట్ ప్రస్తావన రాగానే "లోటు బడ్జెట్" అనే మాట వినిపించేది. కానీ అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటే ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఏటా బడ్జెట్‌ను పెంచుతున్నాం. కేవలం మధ్యప్రదేశ్ కోసమే రూ.13 వేల కోట్లు కేటాయించాం'
- ప్రధాని నరేంద్ర మోదీ
Vande Bharat express train showcases the skill, potential and confidence of our nation: PM Modi at Bhopal's at Rani Kamlapati railway station pic.twitter.com/p7kmvKRKkV
— ANI (@ANI) April 1, 2023
Also Read: Sanjay Raut Death Threat: సంజయ్ రౌత్ హత్యా బెదిరింపుల కేసులో నిందితుడి అరెస్ట్, కొనసాగుతున్న విచారణ
TS ICET: జూన్ 4న తెలంగాణ ఐసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!
TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు
APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - వివరాలు ఇలా!
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!