Sanjay Raut Death Threat: సంజయ్ రౌత్ హత్యా బెదిరింపుల కేసులో నిందితుడి అరెస్ట్, కొనసాగుతున్న విచారణ
Sanjay Raut Death Threat: సంజయ్ రౌత్‌ను చంపేస్తామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Sanjay Raut Death Threat:
పుణేలో అరెస్ట్..
ఉద్దవ్ థాక్రే శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు హత్యా బెదిరింపులు రావడం సంచలనం రేపింది. రౌత్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. పుణెలో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. అయితే...ఈ వ్యక్తి ఆ గ్యాంగ్‌తో సంబంధం ఉందా లేదా అన్నది విచారణ తరవాతే తేలనుంది.
"సంజయ్ రౌత్‌ను హత్య చేస్తామని బెదిరించిన నిందితుడిని పుణేలో అరెస్ట్ చేశాం. లారెన్స్ బిష్ణోయ్ పేరు వాడుకుని ఇలా వార్నింగ్ ఇచ్చాడు. గతంలో సల్మాన్ ఖాన్‌కు కూడా ఇదే విధంగా బెదిరింపులు వచ్చాయి. ఈ రెండు కేసులపైనా అతడిని ప్రశ్నిస్తున్నాం. బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉందా లేదా అన్నది విచారణ జరిపి తేలుస్తాం"
- ముంబయి పోలీసులు
#UPDATE | Mumbai: A person has been detained in Pune and is being interrogated pertaining to a threat message to Sanjay Raut.
— ANI (@ANI) April 1, 2023
Mumbai: The accused person who was detained in Pune related to a threat message to Sanjay Raut used the name of Lawrence Bishnoi. He will also be interrogated related to the threat message to actor Salman Khan. Accused's connection with the Bishnoi gang will also be probed:…
— ANI (@ANI) April 1, 2023
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తనను చంపేస్తామని బెదిరించినట్టు సంజయ్ రౌత్ పోలీసులకు వెల్లడించారు. ఆయన వాట్సాప్ నంబర్‌కు ఆ గ్యాంగ్ నుంచి మెసేజ్ వచ్చింది. AK-47తో ఢిల్లీలోనే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలాను ఎలా అయితే హత్య చేశామో...అదే విధంగా చంపేస్తామని హెచ్చరించింది. ఈ బెదిరింపులు వచ్చిన వెంటనే సంజయ్ రౌత్ అలెర్ట్ అయ్యారు. ఆ వివరాలన్నింటినీ ముంబయి పోలీస్ కమిషనర్‌కు అందజేశారు. విచారణ జరిపించాలని కోరారు. "నువ్వో హిందూ వ్యతిరేకివి. తప్పకుండా చంపేస్తాం" అని మెసేజ్ పంపించారు. తనకు ప్రాణహాని ఉందని గతంలోనే చాలా సందర్భాల్లో చెప్పారు రౌత్. మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు ఇదే విషయాన్ని అప్పట్లో వివరించారు. ఇప్పుడు నేరుగా ఆయన సెల్కే మెసేజ్ రావడం ఆందోళన కలిగించింది. అంతకు ముందు ఇదే బిష్ణోయ్ గ్యాంగ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కూ వార్నింగ్ పంపాయి. గతేడాది మార్చిలో సల్మాన్ ఖాన్ ఆఫీస్‌కు కాల్ చేసి బెదిరించింది బిష్ణోయ్ గ్యాంగ్. జింకను వేటాడినందుకు ఆయనను చంపేస్తామని హెచ్చరించింది. "సారీ చెప్పండి లేదంటే తరవాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి" అని సల్మాన్ భాయ్‌ను బెదిరించింది.
Also Read: Swedish National Arrested: మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన, అరెస్ట్ చేసిన పోలీసులు