Swedish National Arrested: మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన, అరెస్ట్ చేసిన పోలీసులు
Swedish National Arrested: ఇండిగో ప్లైట్‌లో ఓ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు.
Swedish National Arrested:
ఇండిగో ఫ్లైట్‌లో ఘటన..
ఇండిగో ఫ్లైట్‌లో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు సిబ్బందితో గొడవ పడ్డాడు. బ్యాంకాక్ నుంచి ముంబయికి వచ్చే ఫ్లైట్‌లో స్వీడిష్ ప్రయాణికుడు ఓ క్రూ మెంబర్‌ను తిట్టాడు. ముంబయిలో ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. అంధేరి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. ఆ వ్యక్తిని మందలించిన కోర్టు రూ.20 వేల జరిమానా విధించి బెయిల్ ఇచ్చింది. ఈ ఘటనపై పూర్తి విచారణకు అధికారులు ఆదేశించారు. నిందితుడి పేరు క్లాస్ ఎరిక్‌గా గుర్తించారు. వయసు 63 ఏళ్లు. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన వివరాల ప్రకారం...ఆహారం విషయంలో ఫ్లైట్ సిబ్బందితో గొడవ పడినట్టు తెలుస్తోంది. సీ ఫుడ్ కావాలని మొండి పట్టు పట్టడంతో పాటు పదేపదే సిబ్బందిని తిట్టాడు. సీ ఫుడ్ లేదని చెప్పిన ఎయిర్ హోస్టెస్ చికెన్ తీసుకొచ్చి ఇచ్చింది. బిల్ పే చేయాలని అడగ్గా...ఆమె చేయి పట్టుకున్నాడు. వెంటనే చేయి వెనక్కి లాక్కున్న ఎయిర్ హోస్టెస్ బిల్ కట్టాలని గట్టిగా అడిగింది. వెంటనే ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఈ గొడవలో జోక్యం చేసుకున్న మరో ప్రయాణికుడిపై దాడి చేశాడు. అప్పటికే ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్ కేప్టెన్‌కు ఈ గొడవ గురించి చెప్పింది. ల్యాండ్ అయిన వెంటనే పైలట్...అక్కడి అధికారులకు ఈ సంఘటన అంతా వివరించాడు. ఆ తరవాత పోలీసులు వచ్చి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఈ మధ్య యూరినేషన్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ తరవాత కంపెనీ అలెర్ట్ అయింది. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. దీనిపై ఇంకా చర్చ జరుగుతుండగానే మళ్లీ వార్తల్లో నిలిచింది Air India.
లండన్ నుంచి ముంబయికి వస్తున్న ఫ్లైట్‌లో ఓ 37 ఏళ్ల వ్యక్తి బాత్‌రూమ్‌లో సిగరెట్ తాగడం కలకలం రేపింది. రమాకాంత్ అనే వ్యక్తి సిగరెట్ తాగడమే కాకుండా తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడు. కంపెనీ ఫిర్యాదుతో ముంబయి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఫ్లైట్‌లో సిగరెట్ తాగేందుకు అనుమతి లేదని, చెప్పినా వినకుండా ఆ వ్యక్తి అందరినీ ఇబ్బందికి గురి చేశాడని ఎయిర్ ఇండియా సిబ్బంది వెల్లడించింది.
"ఫ్లైట్‌లో స్మోకింగ్‌కు అనుమతి లేదు. కానీ ఆయన బాత్‌రూమ్‌లోకి వెళ్లి సిగరెట్ వెలిగించారు. వెంటనే అలారం మోగింది. మేమంతా అలెర్ట్ అయ్యి బాత్‌రూమ్ వైపు వెళ్లాం. ఆయన చేతిలో సిగరెట్ ఉంది. మేం ఆ సిగరెట్‌ను లాగేసుకుని పారేశాం. ఇలా చేసినందుకు ఆయన మాపై అరవడం మొదలు పెట్టాడు. ఏదో విధంగా నచ్చజెప్పి ఆయన సీట్‌లో కూర్చోబెట్టాం. కాసేపటి తరవాత ఉన్నట్టుండి లేచి ఫ్లైట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. అది చూసి తోటి ప్రయాణికులంతా భయపడిపోయారు. మేం ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. గట్టిగా అరుస్తున్నాడు. చేసేదేమీ లేక మేము ఆయనను గట్టిగా పట్టుకుని చేతులు కాళ్లు కట్టేశాం. మళ్లీ కుర్చీలో బలవంతంగా కూర్చోబెట్టాం"
-ఎయిర్ ఇండియా సిబ్బంది
Also Read: Emergency At Airport: విమానం టేకాఫ్ కాగానే ఢీకొట్టిన పక్షి, ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ