Emergency At Airport: విమానం టేకాఫ్ కాగానే ఢీకొట్టిన పక్షి, ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ
Emergency At Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
Emergency At Airport:
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. దుబాయ్‌కు చెందిన FedEx ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయిన వెంటనే ఓ పక్షి ఢీకొట్టింది. అప్రమత్తమైన అధికారులు అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉదయం 10-11 గంటల వరకూ ఈ ఎమర్జెన్సీ కొనసాగినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపారు. ఫెడెక్స్ కార్గో ఉదయం 10గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. కుడి వైపు ఓ పక్షి వచ్చి ఢీకొట్టింది. గమనించిన పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. గంట సేపటి తరవాత పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.
Full emergency declared at Delhi airport after Dubai bound FedEx aircraft suffers bird-hit soon after take-off: Airport official
— ANI (@ANI) April 1, 2023
Delhi- Dubai FedEx flight was involved in air turnback due to a suspected bird hit at 1000 ft today. Delhi airport (DIAL) declared an emergency. Aircraft landed back safely. After inspection, it has been released for flight: DGCA
— ANI (@ANI) April 1, 2023
గతంలోనూ...
విమానాలు టేకాఫ్ అయినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేంత వరకూ క్షణక్షణ గండమే. ఎప్పుడు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తుందో అర్థం కాదు. అనుకోకుండా వాతావరణం మారినా..సమస్యలు తప్పవు. పైలట్ సహా సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉంటే పర్లేదు. కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా...భారీగా ప్రాణనష్టం వాటిల్లుతుంది. ఒక్కోసారి క్రూ అంతా అప్రమత్తంగానే ఉన్నా...అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా విమానాల విషయంలో "పక్షులు ఢీకొట్టడం" చాలా కామన్. ఒక్కోసారి పెను ప్రమాదాలకూ దారి తీస్తాయి ఇలాంటి ఘటనలు. మరి కొన్ని సార్లు భారీగా ఆర్థిక నష్టాన్ని మిగుల్చుతాయి. గతేడాది Akasa Air Lines కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఈ ఫ్లైట్‌ని ఓ పక్షి బలంగా ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది విమానం. గతేడాది ఆగస్ట్‌లో Akasa AirLines ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్‌ను ప్రారంభించారు. అక్టోబర్ 27న Akasa B-737-8 ఎయిర్‌క్రాఫ్ట్‌కు పక్షి ఢీ కొట్టిందని Directorate General of Civil Aviation (DGCA)వెల్లడించింది. ల్యాండ్ అయిన తరవాత ఫ్లైట్ రాడోమ్ (Radome) డ్యామేజ్ అయినట్టు గుర్తించారు.
పక్షులు ఢీకొట్టడం వల్ల విమానాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఒక్కోసారి ఇంజిన్‌లో ఇరుక్కుపోవడం వల్లా ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ ఫ్లైట్లు కేవలం పక్షులు ఢీకొట్టడం వల్ల ఏటా వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఏటా 1.2 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. అంటే...మన ఇండియన్ కరెన్సీలో రూ.7 వేల కోట్లు. టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యే సమయంలో పక్షులు విమానాలను ఢీకొడుతుంటాయి. ఈ సమయంలోనే అవి కొలైడ్ అవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.
Also Read: Swedish National Arrested: మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన, అరెస్ట్ చేసిన పోలీసులు