PM Modi Brother Accident: ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీకి యాక్సిడెంట్!
PM Modi Brother Accident: ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ మైసూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
PM Modi Brother Accident: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీకి కర్ణాటకలోని మైసూరులో యాక్సిడెంట్ జరిగింది. ఈ కారు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ప్రహ్లాద్ మోదీ తన కుటుంబంతో కలిసి బందీపుర్‌కు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
మీడియా కథనాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ప్రహ్లాద్ మోదీ భార్య, కుమారుడు మెహుల్, కోడలు, మనవడు మేనత్‌లు ఆయన వెంట ఉన్నారు. మెర్సిడెస్ బెంజ్‌లో ఆయన తన కాన్వాయ్‌తో పాటు బందీపుర్‌కు వెళుతుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
టైమ్స్ నౌ ప్రకారం.. ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం JSS ఆసుపత్రిలో చేర్చారు. కడ్కోళ్ల అనే ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన డ్రైవర్ సత్యన్నారాయణకు కూడా గాయాలయ్యాయి. ప్రహ్లాద్ మోదీకి ప్రమాదం తప్పినట్లు సమాచారం.
ప్రహ్లాద్ మోదీ.. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. 66 ఏళ్ల ప్రహ్లాద్.. 2001లో సంస్థ స్థాపించినప్పటి నుంచి అందులో ఉన్నారు. హీరాబెన్ మోదీకి జన్మించిన ఆరుగురు పిల్లలలో ప్రహ్లాద్ నాలుగో సంతానం.