అన్వేషించండి

PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది ఆరోజే.. ఆ లోపు ఈ పని చేసేయండి

PM Kisan :దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన.

PM Kisan :దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan). ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు. ఇప్పటివరకు 18 విడతలు విడుదల కాగా, 19వ విడత కోసం లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు.

19వ విడత విడుదల తేదీ
మీడియా నివేదికల ప్రకారం.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదుపరి విడుదల తేదీ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 24, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్‌లో పర్యటించనున్నారు. ఆయన అక్కడి వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొని పీఎం కిసాన్ యోజన 19వ విడత నిధులను విడుదల చేయనున్నారు.అలాగే, మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.

ఇ-కేవైసీ తప్పనిసరి
ఈ పథకం కింద ప్రయోజనాలను పొందాలంటే రైతులు e-KYC (ఎలక్ట్రానిక్-నో యువర్ కస్టమర్) ప్రక్రియను తప్పనిసరి పూర్తి  చేయాలి. ప్రధాని మోదీ గత ఏడాది అక్టోబర్ 15, 2024న 18వ విడత నిధులను విడుదల చేశారు.

పీఎం కిసాన్ పథకానికి ఎలా నమోదు చేసుకోవాలి?
అర్హత గల రైతులు క్రింది డాక్యుమెంట్లు సమర్పించాలి:
* ఆధార్ కార్డు
*  పౌరసత్వ ధృవీకరణ పత్రం
*  భూమి  పత్రాలు
*  బ్యాంక్ ఖాతా వివరాలు
* ఇ-కేవైసీ చేయాలి

PM Kisan కోసం నమోదు చేయాలంటే:
* ఆన్‌లైన్ నమోదు: అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చు.
* సామూహిక సేవా కేంద్రం (CSC): గ్రామాల్లోని CSC కేంద్రాల ద్వారా సహాయం పొందవచ్చు.
* రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారులను సంప్రదించి కూడా నమోదు చేసుకోవచ్చు. 
* పట్వారీ లేదా రెవెన్యూ అధికారుల సహాయంతో నమోదు చేయించుకోవడం.

Also Read  : Meeting of Telangana Congress MLAs: స్థానిక ఎన్నికల్లో అత్యధికం ఏకగ్రీవం చేసుకోండి - ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేవంత్ దిశానిర్దేశం

పీఎం కిసాన్ 18వ విడత స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
* స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ను సందర్శించండి.
* స్టెప్ 2: హోమ్‌పేజీలో "Check Beneficiary Status" లింక్‌పై క్లిక్ చేయండి.
* స్టెప్ 3: మీ మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ ఐడి ఉపయోగించి స్టేటస్ చెక్ చేయండి.
* స్టెప్ 4: స్క్రీన్‌పై చూపిన క్యాప్‌చా కోడ్ ఎంటర్ చేసి సంబంధిత వివరాలు నమోదు చేయండి.
* స్టెప్ 5: "Get Data" పై క్లిక్ చేస్తే మీ స్టేటస్ చూపబడుతుంది.

రైతులకు ఉపయోగకరమైన పథకం
పీఎం కిసాన్ యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఉపశమనంగా మారింది. ఈ పథకం కింద ఇప్పటివరకు వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. 19వ విడత విడుదలకు ఇంకా కొన్ని రోజులే ఉండడంతో  అర్హులైన రైతులు తమ బ్యాంక్ ఖాతా వివరాలు, ఇ-కేవైసీ ముందుగానే పూర్తి చేయాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం "pmkisan.gov.in" అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read  : PM Modi : దేశం కోసం మేము.. కుటుంబం కోసం కాంగ్రెస్: ప్రధాని మోదీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
BCCI Retainership: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
BCCI Retainership: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
Dhanush D56 Movie: మరోసారి సూపర్ హిట్ కాంబో రిపీట్ - ధనుష్ కొత్త సినిమాకు రెహమాన్ మ్యూజిక్!
మరోసారి సూపర్ హిట్ కాంబో రిపీట్ - ధనుష్ కొత్త సినిమాకు రెహమాన్ మ్యూజిక్!
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Aishwaryarai Bachchan: ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
Embed widget