Pervez Musharraf: వాజ్‌పేయీకి షేక్ హ్యాండ్ ఇచ్చిన ముషారఫ్, షాక్ అయిన ప్రపంచ దేశాలు
Pervez Musharraf: అప్పటి ప్రధాని వాజ్‌పేయీకి ముషారఫ్ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఘటన సంచలనం సృష్టించింది.
Pervez Musharraf:
అమెరికాతో స్నేహం..
పదేళ్ల పాటు పాకిస్థాన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన ముషారఫ్ ఫోర్ స్టార్ జనరల్‌గానూ క్యాడర్ సంపాదించుకున్నారు. అధ్యక్షుడి స్థాయిలో ఆనయ తీసుకున్న నిర్ణయాలు కొన్ని తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. అల్‌ఖైదా ఉగ్రసంస్థ ఆయనను చంపడానికి మూడుసార్లు ప్రయత్నించింది. అల్‌ఖైదా, తాలిబన్లపై పోరాటానికి ఎప్పుడూ సిద్ధమేనని తేల్చి చెప్పిన ముషారఫ్...ఇందుకోసం అమెరికాతో చేయి కలిపారు. ఇటు ఇండియాతో మాత్రం ఎప్పుడూ కయ్యం పెట్టుకున్నారు. కార్గిల్ వార్ యుద్ధం జరిగింది ఆయన కారణంగానే. ఆ యుద్ధాన్ని ముందుండి నడిపారు ముషారఫ్. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ముషారఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తొలగించాలని ప్రయత్నించగా...ఏకంగా ప్రధానినే తప్పించారు ముషారఫ్. మహిళా హక్కుల్ని కాపాడేందుకు 2001లో ట్విన్ టవర్స్‌పై దాడి జరిగిన తరవాత అమెరికాతో మైత్రి పెంచుకున్నారు. అమెరికన్ డ్రోన్‌లు పాకిస్థాన్ ఎయిర్ బేస్‌లో నిఘా పెట్టేందుకు అనుమతినిచ్చారు ముషారఫ్. స్థానిక మిలిటెంట్ గ్రూప్‌లతో యుద్ధమూ చేశారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌తోనూ స్నేహం కొనసాగించారు. పాకిస్థాన్ సైన్యానికి పెద్ద ఎత్తున సహకారం అందించేందుకు చొరవ చూపించారు. అప్ఘనిస్థాన్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికా సేనలకు పాక్ సైన్యం సహకారం అందించింది.
భారత్‌తోనూ మైత్రి..
ఇక విదేశాంగ విధానాల పరంగా చూస్తే భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నించారు ముషారఫ్. ఇండియాపై మిలిటరీ ఆపరేషన్ చేసినప్పటికీ ఆ తరవాత దారికొచ్చారు. 2002లో జరిగిన ఓ సమ్మిట్‌లో ప్రపంచమంతా ఆశ్చర్యపోయే ఓ ఘటన జరిగింది. ఒక్కసారిగా ముషారఫ్ పేరు మారుమోగింది. ఆ సమావేశంలో ప్రసంగించిన తరవాత ఉన్నట్టుండి ముషారఫ్ అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వద్దకు వెళ్లారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. శాంతి చర్చలకు ఆహ్వానించారు. కశ్మీర్ సమస్యను శాంతియుత విధానంలో పరిష్కరించుకునేందుకు ఆసక్తి చూపించారు. ఆయన పాలనలో చాన్నాళ్ల పాటు పాక్, భారత్ మధ్య చర్చలు జరిగాయి కూడా.
కానీ ఎప్పుడైతే ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారో...ఆ విషయం మళ్లీ మొదటికే వచ్చింది. అంతే కాదు. ముషారఫ్ పాలనలో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతో మెరుగు పడింది. 7.5% వృద్ధి రేటుతో దూసుకుపోయింది. అయితే క్రమక్రమంగా ఆయన మరీ నియంతగా వ్యవహరించడం మొదలు పెట్టారు. బలూచిస్థాన్‌పై మిలిటరీ యాక్షన్ తీసుకోవడమూ ఆయనపై ఆగ్రహం పెంచింది. ఆ తరవాత పాక్‌లో షరియా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసిన వందలాది మంది విద్యార్థులను హత్య చేయించారన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. 2007లో బెనజీర్ భుట్టో హత్యకు గురయ్యారు. ఈ హత్యలో ముషారఫ్ హస్తం ఉందన్న వాదనలు వినిపించాయి. దేశమంతా అతలాకుతలమైంది. ఆ సమయంలో ఎమర్జెన్సీ విధించారు. ఈ నిర్ణయంతో ఆయన పతనం మొదలైంది. 2008లో ఎన్నికలు జరగ్గా ముషారఫ్ ఓటమి చవి చూశారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసి లండన్‌కు వెళ్లిపోయారు. 2013లో మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలన చూసినా అనర్హత వేటు వేశారు. 2016లో దుబాయ్‌కు వెళ్లిపోయారు.
Also Read: Pervez Musharraf Profile: ముషారఫ్ పాక్ నుంచి ఎందుకు పారిపోయారు? భుట్టోను హత్య చేయించారా?