Top Headlines Today: ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు! తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయన్న హరీష్ రావు
Andhra Pradesh News Today | నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు - ఇక రియల్ 'పవర్' స్టార్, తొలి సంతకం ఆ పెన్నుతోనే!
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని (Vijayawada) క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. తన వదిన, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇచ్చిన పెన్నుతో బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, సిబ్బంది శాలువాలు కప్పి సత్కరిస్తూ అభినందనలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పార్టీకి రాజీనామా చేస్తా- ఒక్కొక్కడ్నీ నరుకుతా- ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు. గత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నాయకులకు, అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓవైపు బాధతో కన్నీళ్లు, జరిగిన అన్యాయంపై ఆవేశం, నష్టాన్ని పూడ్చాలని ఆవేదన ఇలా మొత్తం ప్రెస్‌మీట్ అంతా ఎమోషనల్‌గా సాగింది. గత ప్రభుత్వంలో చాలా మంది అధికారు తనను తన ఫ్యామిలీని చాలా ఇబ్బందులు పెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి - వరుసగా ఘోరాలు - సర్కార్‌పై హరీష్ రావు విమర్శలు
తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ట్వీట్ పెట్టిన రాజకీయ చిచ్చు - జర్నలిస్టుపై కేసు పెట్టిన తెలంగాణ పోలీసులు
తెలంగాణలో విద్యుత్ అధికారుల తీరు వివాదాస్పదం అయింది. ఒక మహిళ తన ఇంటికి కరెంట్లేదని .. అధికారులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని ఓ ట్వీట్ పెట్టారు. ఆమె అడ్రస్ మేరకు ఇంటికి వెళ్లిన విద్యుత్ అధికారులు ప్రాబ్లం సాల్వ్ చేశామని ట్వీట్ తొలగించాలని కోరారు. అయితే ఆమె ట్వీట్ తొలగించడానికి ఇష్టపడలేదు. సమస్య పరిష్కారం అయింది కాబట్టి తొలగిస్తేనే వెళ్తామని విద్యుత్ సిబ్బంది మొండికేయడంత చేసేదిలేక ట్వీట్‌ను తొలగించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీ కేబినెట్ తొలి భేటీకి ముహూర్తం ఫిక్స్ - అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఏపీలో కొత్త ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత తొలి కేబినెట్ భేటీకి (AP Cabinet) ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న సచివాలయంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి