News
News
వీడియోలు ఆటలు
X

Pavan In Delhi : ఢిల్లీలో పవన్ కల్యాణ్ - బీజేపీ ముఖ్యనేతలతో భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారని ఆ పార్టీ ప్రకటించింది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లారని.. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారని ప్రకటించింది.

FOLLOW US: 
Share:

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీ చేరుకుని మొదటగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా  ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారని ఆ ఆహ్వానం మేరకు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారని జనసేన వర్గాలు మీడియాకు సమాచారం అందించాయి. ప్రహ్లాద్ జోషి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రహ్లాద్ జోషితో పాటు బీజేపీ ముఖ్య నేతలతోనూ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారని ప్రెస్‌నోట్ విడుదల చేశారు కానీ..ఆ ముఖ్య నేతలెవరో స్పష్టత లేదు.

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఢిల్లీ వెళ్లారు. ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. శ్రీ ప్రహ్లాద్ జోషి గారితో సమావేశం అయిన తరువాత బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.

— JanaSena Party (@JanaSenaParty) September 7, 2021

">

పవన్ కల్యాణ్‌ చాలా రోజుల తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తిరుపతి ఉపఎన్నికల సమయంలో వివిధ రకాల చర్చల నిమిత్తం రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన గురించి బీజేపీ పట్టించుకోలేదు. హఠాత్తుగా ప్రహ్లాద్ జోషి పిలుపుతో ఢిల్లీకి వెళ్లారు. ఇటీవలి కాలంలో ఏపీలో బీజేపీ-జనసేన మధ్య కోఆర్డినేషన్ దెబ్బతిన్నది. రెండు వారాల కిందట సమావేశం పెట్టుకుని కలసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నా.. ఎవరి పోరాటాలు వారు చేస్తున్నారు. రూపు మారిన రోడ్లపై జనసేన సొంతంగా డిజిటల్ ఉద్యమం చేపట్టింది.  బీజేపీ వినాయక చవితి పండుగపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను నిరసిస్తూ సొంతంగా కార్యక్రమాలు చేపడుతోంది. ఎక్కడా  రెండు పార్టీలు కలిసి రాజకీయ పయనం చేసే పరిస్థితి కనిపించడం లేదు. Also Read : ఒక్కో సినిమాకు పవన్ కల్యాణ్ ఎంత తీసుకుంటారో తెలుసా..?

అదే సమయంలో ఏపీ బీజేపీ నేతలపై జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. కొంత మంది నేతలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో బీజేపీ హైకమాండ్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లుగా జనసేన వర్గాలు గతంలో ఆఫ్ ది రికార్డు చెప్పాయి. ప్రస్తుతం ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పవన్ కల్యాణ్ తో పాటు జనసేన నేతలకు అంతకగా సరిపడటం లేదు. విజయవాడకు చెందిన జనసేన నేత పోతిన మహేష్  బీజేపీతో పొత్తు వల్ల జనసేన తీవ్రంగా నష్టపోతోందని పలుమార్లు నేరుగా మీడియాతోనే అన్నారు. స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నికల తర్వాత రెండు పార్టీల మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది. Also Read : ఏపీలో ముదిరిన వినాయక చవితి ఆంక్షల వివాదం

అయితే ప్రహ్లాద్ జోషి ఏ కారణంతో పిలిచారో జనసేన స్పష్టత ఇవ్వలేదు. అలాగే బీజేపీ తరపున ఏ ముఖ్య నేతల్ని కలిశారో కూడా జనసేన చెప్పలేదు. మోడీ, అమిత్ షా , నడ్డా లాంటి పెద్ద నేతలతో భేటీ అయితే ఫోటోలతో సహా చెప్పేవారు కానీ అలాంటి ప్రకటన చేయలేదు. రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. 

Published at : 07 Sep 2021 08:09 PM (IST) Tags: BJP janasena Pavan Kalyan AP BJP pavan delhi prahald joshi

సంబంధిత కథనాలు

YSR Rythu Bharosa 2023: నేడే రైతు భరోసా  నిధులు- కర్నూలు జిల్లాలో బటన్ నొక్కనున్న సీఎం జగన్

YSR Rythu Bharosa 2023: నేడే రైతు భరోసా నిధులు- కర్నూలు జిల్లాలో బటన్ నొక్కనున్న సీఎం జగన్

TTD News: ఏడుకొండల్లో కొనసాగుతున్న భక్తుల‌ రద్దీ - సర్వదర్శనానికి 18 గంటల సమయం

TTD News: ఏడుకొండల్లో కొనసాగుతున్న భక్తుల‌ రద్దీ - సర్వదర్శనానికి 18 గంటల సమయం

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!

Top 10 Headlines Today: బాలినేనితో సీఎం జగన్ ఏం మాట్లాడతారు? ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌

Top 10 Headlines Today: బాలినేనితో సీఎం జగన్ ఏం మాట్లాడతారు? ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌

టాప్ స్టోరీస్

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

Telangana New Party :  తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

AP Flexi War : ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు - వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

AP Flexi War :  ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు -  వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స