Train Video: రైల్లో ఎలక్ట్రిక్ కెటిల్‌తో నూడిల్స్ వండిన మహిళ - వీడియో వైరల్ - రైల్వే శాఖ ఏం చేసిందంటే?
Train Noodles: రైల్లో ప్రమాదాలకు ఎవరు కారణం.. అంటే ప్రయాణికులే. వారు చేసే అడ్డగోలు పనుల వల్లేనని మరోసారి నిరూపితమయింది.

Passenger cooks noodles in train using electric kettle: భారతీయ రైల్వేలలో భద్రతా నిబంధనలు ఉల్లంఘించే ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర మూలాలున్న ఒక మహిళ ప్రయాణికురాలు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఏసీ కోచ్‌లో ఇంటి ఎలక్ట్రిక్ కెటిల్‌ను చార్జింగ్ సాకెట్‌లో ప్లగ్ చేసి ఇన్‌స్టంట్ నూడుల్స్ వండిన వీడియో వైరల్ అయింది.
వీడియో నవంబర్ 20న రికార్డు చేశారు. ఏసీ కోచ్‌లో కూర్చున్న మహిళ, కెటిల్‌ను మొబైల్ చార్జింగ్ కోసం ఉన్న సాకెట్‌లో పెట్టి నూడుల్స్ వండుతూ కనిపిస్తుంది. "ఎక్కడైనా కిచెన్ సెటప్ చేసుకోగలను" అంటూ ఆమె జోక్ చేస్తూ, "15 మందికి టీ తాగించాలని" చెబుతూ కనిపిస్తుంది. ఆమె కుటుంబ సభ్యులు ఆనందంగా చూస్తూ గడిపారు.
సెంట్రల్ రైల్వే అధికారులు వీడియోను చూశారు. ప్రయాణికురాలి గుర్తింపు, ట్రైన్ ట్రావెల్ డేటా, CCTV ఫుటేజ్‌ను సేకరిస్తున్నారు. ఈ ఘటన రైల్వేల చార్జింగ్ సాకెట్లు మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల కోసం మాత్రమే పెట్టారు. హై-వాటేజ్ డివైసెస్‌కు ఉపయోగించడం వల్ల షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలకు దారి తీస్తుందని స్పష్టం చేశారు. ఇది లైట్లు, ఫ్యాన్లు, ఏసీ సిస్టమ్‌లను ప్రభావితం చేసి, ప్రయాణికుల భద్రతకు ముప్పు అని హెచ్చరించారు.
SHOCKER 🚨 Woman cooked Maggi in train for reels 🤯
— News Algebra (@NewsAlgebraIND) November 21, 2025
She plugged kettle into a mobile charging socket & also prepared Tea 😳
INDIAN RAILWAYS : "It is unsafe & illegal. It can lead to fire incidence & be disastrous for passengers also. Action to be taken" pic.twitter.com/MH7lV6QbGq
సెంట్రల్ రైల్వే అధికారిక X హ్యాండిల్‌లో నవంబర్ 21న పోస్ట్ చేసిన ప్రకటనలో, " ఆ వీడియో పోస్టు చేసిన చానల్ మ,సంబంధిత వ్యక్తిపై చర్యలు ప్రారంభించాం. ట్రైన్‌లో ఎలక్ట్రిక్ కెటిల్ ఉపయోగం నిషేధం. ఇది అసురక్షితం, చట్టవిరుద్ధం, శిక్షార్హం. అగ్ని ప్రమాదాలకు దారి తీస్తుంది , ఇతర ప్రయాణికులకు విపత్తు" అని పేర్కొన్నారు. రైల్వేల చట్టం సెక్షన్ 147(1) (రైల్వే ఆస్తి తప్పుడు ఉపయోగం) ప్రకారం ఫైన్ లేదా జైలుకు పంపే అవకాశం ఉంది.
Travel Smart, Stay Safe!
— Central Railway (@Central_Railway) November 22, 2025
⚠️ High-voltage appliances like electric kettles can trigger sparks, fire risks, or electrical tripping inside train coaches.
Please do not use such devices and help maintain a safe environment on the train. 🚆#CentralRailway #ResponsibleRailyatri pic.twitter.com/X9jBE5PdEP
సాకెట్ల దగ్గర హెచ్చరిక స్టికర్లు ఉన్నప్పటికీ ప్రయాణికులు పాటించడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "ఇలాంటి చిన్న చర్యలు పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. ప్రయాణికులు ఎవరైనా ఇలాంటివి చూస్తే వెంటనే సిబ్బందిని రిపోర్ట్ చేయాలి" అని సెంట్రల్ రైల్వే సీనియర్ అధికారి పేర్కొన్నారు.





















