license For AI content creators: ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్సులు - సంచలన నిర్ణయం దిశగా కేంద్రం !
AI content creators: ఏఐను ఉపయోగించి పెద్ద ఎత్తున ఫేక్ వీడియోలు సర్క్యూలేట్ చేస్తూండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగు వేస్తోంది. పార్లమెంటరీ కమిటీ సంచలన సిఫారసులతో నివేదిక సమర్పించింది.

Parliamentary panel suggests licensing requirements for AI content creators: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి విపరీతంగా వీడియోలు, ఫోటోలు తయారు చేస్తున్నారు క్రియేటర్లు. వీటితో విపరీతంగా ఫేక్ న్యూస్ ప్రసారం అవుతూండటంతో కట్టడి కోసం మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. AI కంటెంట్ సృష్టికర్తలకు లైసెన్సింగ్ ఉండాలని కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తాజాగా పార్లమెంట్ కు సిఫారసు చేసింది. AI ద్వారా సృష్టించిన కంటెంట్‌కు లేబులింగ్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
భారతీయ జనతా పార్టీ ఎంపీ నిశికాంత్ దుబే నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తృతంగా పరిశీలన జరిపి నివేదిక సిద్ధం చేసింది. AI ద్వారా సృష్టించిన వీడియోలు, కంటెంట్‌కు లేబులింగ్‌ను తప్పనిసరి చేయాలని కమిటీ సూచించింది. ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేసే వ్యక్తులు , సంస్థలను గుర్తించి, వారిపై చట్టపరమైన , సాంకేతిక చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. కమిటీ యొక్క డ్రాఫ్ట్ రిపోర్ట్ ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. తర్వాత పార్లమెంట్ సెషన్‌లో ప్రవేశ పెడతారు. ఈ సిఫారసులు బైండింగ్ కాకపోయినప్పటికీ, ప్రభుత్వం సాధారణంగా ఇటువంటి సిఫారసులను ఆమోదిస్తుంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే డీప్‌ఫేక్‌ల సమస్యను పరిశీలించడానికి తొమ్మిది మంది సభ్యుల బృందాన్ని నియమించారు. డీప్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించి ఫేక్ స్పీచ్ డిటెక్షన్ చేయడం, డీప్‌ఫేక్ వీడియోలు , ఇమేజ్‌లను గుర్తించే సాఫ్ట్‌వేర్ డిజైన్ , డెవలప్‌మెంట్ చేయడం వంటిని గుర్తించారు. AI , మెషిన్ లెర్నింగ్ (ML) టెక్నాలజీలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, ధృవీకరించడం , నిరోధించడంలో సామర్థ్యాన్ని పెంచుతున్నాయని కమిటీ గుర్తించింది. AI ప్రస్తుత రూపంలో ఫాక్ట్-చెకింగ్ కోసం ఉపయోగించలేమని ఇది ఆన్‌లైన్‌లో ఇప్పటికే ఉన్న సమాచారంపై ఆధారపడుతుందని మంత్రిత్వ శాఖలు చెబుతున్నాయి.
ఫేక్ న్యూస్‌ను పబ్లిక్ ఆర్డర్ , డెమోక్రటిక్ ప్రాసెస్‌కు “తీవ్రమైన ముప్పు”గా కమిటీ వర్ణించింది. దీనిని అరికట్టడానికి, పీనల్ నిబంధనలను సవరించడం, జరిమానాలను పెంచడం, బాధ్యతను నిర్ధారించడం వంటి చర్యలను కమిటీ సిఫారసు చేసింది. అన్ని ప్రింట్, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఫాక్ట్-చెకింగ్ మెకానిజమ్స్ , ఇంటర్నల్ ఒంబుడ్స్‌మెన్‌ల ఉనికిని తప్పనిసరి చేయాలని కమిటీ సూచించింది. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ, MeitY,ఇతర సంబంధిత విభాగాల మధ్య దగ్గరి సమన్వయం అవసరమని కమిటీ నొక్కి చెప్పింది.
కమిటీ రిపోర్ట్, ఫేక్ న్యూస్ మరియు డీప్‌ఫేక్‌లను అరికట్టడానికి సాంకేతిక , చట్టపరమైన చర్యలను కలిపి ఒక సమగ్ర విధానాన్ని సూచిస్తుంది. పార్లమెంట్ లో ఈ సిఫారసులను ఆమోదిస్తే.. ఫేక్ న్యూస్ కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లే అవుతుంది.





















