Parliament Winter session: వాళ్ల బాధను అర్థం చేసుకోండి- సభ సజావుగా సాగనివ్వండి: మోదీ
Parliament Winter session: శీతాకాల సమావేశాలను సజావుగా జరిపేందుకు ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
Parliament Winter session: పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలకు కీలక విజ్ఞప్తి చేశారు. సమావేశాలను సజావుగా సాగేలా విపక్షాలు సహకరించాలని, కొత్త ఎంపీల బాధను అర్థం చేసుకోవాలని మోదీ కోరారు.
That is why it is of utmost importance for House to function, especially youth MPs say this. Even Opposition MPs say they don't get to speak in debates, House gets adjourned & they suffer losses. I think all Floor Leaders & party Leaders will understand this pain of the MPs: PM pic.twitter.com/jp8JMTl53U
— ANI (@ANI) December 7, 2022
జీ20పై
జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం భారత్‌కు రావటం శుభపరిణామమని మోదీ అన్నారు. 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొన్న తర్వాత తొలిసారి భేటీ అవుతున్నామని గుర్తు చేశారు.
Also Read: MCD Election Results: దిల్లీ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్- ఆప్, భాజపా మధ్య హోరాహోరీ!