Parliament Winter Session LIVE: సాగు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం.. ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేసేందుకు బిల్లును నేడు కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
LIVE
Background
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. 26 బిల్లులను తీసుకొచ్చేందుకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సభలో అందరి సహకారంతో బిల్లులను గట్టెక్కించాలని భావిస్తోంది. తొలిరోజునే సాగు చట్టాల రద్దు బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే పలు అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరిస్తాయనే నమ్మకం తనకు ఉందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. సమావేశాలు మొదలయ్యే ముందు ట్వీట్ చేశారు.
लोकसभा का #WinterSession आज से प्रारंभ हो रहा है। आशा है कि सत्र के दौरान सभी दलों का सक्रिय सहयोग मिलेगा, सदन सुचारू और व्यवस्थित रूप से चलेगा। माननीय सदस्य अनुशासन और शालीनता के साथ कार्यवाही में अपनी सहभागिता निभाएंगे। सामूहिक प्रयासों से हम सदन की गरिमा में अभिवृद्धि करेंगे।
— Om Birla (@ombirlakota) November 29, 2021
[quote author=ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్]పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. సభా సమయంలో అన్ని పార్టీలు సహకరిస్తాయని, సభ సజావుగా సాగుతుందనే నమ్మకం ఉంది. క్రమశిక్షణతో సభ్యులు తమ విధులను నిర్వర్తించాలి. అంతా కలిసి సభామర్యాదను పెంచుదాం. [/quote]
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతిపక్షాలకు సభను సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పార్లమెంట్లో సభామర్యాదను పాటించాలన్నారు.
#WATCH This is an important session of the Parliament. The citizens of the country want a productive session....We are ready to discuss all issues & answer all questions during this session, says PM Narendra Modi ahead of winter session pic.twitter.com/bvZ6JM7LXJ
— ANI (@ANI) November 29, 2021
[quote author= ప్రధాని నరేంద్ర మోదీ]"ఈ సమావేశాలు చాలా ముఖ్యమైనవి. మంచి చర్చను దేశ ప్రజలు కోరుకుంటున్నారు. బంగారు భవిష్యత్తు కోసం వారి బాధ్యతను వారు నిర్వర్తిస్తున్నారు. కొవిడ్-19 కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉన్నాం. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి [/quote]
ఉభయసభలు వాయిదా
నూతన సాగు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం ఉభయసభలు రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదాపడ్డాయి.
రాజ్యసభ ఆమోదం..
నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం పలికింది. విపక్షాల నిరసనల మధ్యే బిల్లును ఆమోదించారు. ఈరోజు ఉదయం లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది.
Amid ruckus in Upper House, the Farm Laws Repeal Bill 2021 passed in Rajya Sabha pic.twitter.com/m4JqZPeOCi
— ANI (@ANI) November 29, 2021
మధ్యాహ్నం రాజ్యసభకు..
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
The Farm Laws Repeal Bill, 2021 will be tabled in Rajya Sabha at 2pm today: Union Minister Pralhad Joshi
— ANI (@ANI) November 29, 2021
(file photo) pic.twitter.com/LZeQi3DBWo
సాగు చట్టాల రద్దు బిల్లుకు ఓకే..
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం పలికింది. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది లోక్‌సభ. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే బిల్లుకు ఆమోదం పలికారు.
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు
లోక్‌సభ తిరిగి ప్రారంభమైన వెంటనే నూతన సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టారు.
Union Agriculture Minister Narendra Singh Tomar tables the Farm Laws Repeal Bill 2021 amid sloganeering by Opposition MPs in Lok Sabha
— ANI (@ANI) November 29, 2021
(Source: Sansad TV) pic.twitter.com/HM4bxEPpT3