అన్వేషించండి

Parliament News: 96 ఏళ్ల పార్లమెంట్ భవనానికి వీడ్కోలు, రేపటి నుంచి కొత్త బల్డింగ్‌లో సమావేశాలు

Parliament News: 96 ఏళ్ల ఘన చరిత్ర కల్గిన పార్లమెంట్ భవనం మరికొద్ది రోజుల్లోనే వెలవెలబోనుంది. త్వరలోనే కొత్త భవనంలోకి పార్లమెంట్ మారుతుండగా.. అందరి దృష్టి పాత భవనంపై పడుతోంది.  

Parliament News: 96 ఏళ్ల ఘన చరిత్ర కల్గిన పాత పార్లమెంట్ భవనం మరికొద్ది రోజుల్లోనే వెలవెలబోనుంది. ఇటీవలే నూతన పార్లమెంట్ భవనం రూపుదిద్దుకోగా.. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ భవనాన్ని ప్రారంభించారు. కానీ పార్లమెంట్ ను అక్కడికి ఇంకా తరలించలేదు. అయితే మరికొద్ది రోజుల్లోనే దీన్ని నూతన భవనానికి తరలించబోతున్నారట. దీంతో అందరి దృష్టి పాత పార్లమెంట్ భవనంపై పడింది. భారత ప్రజాస్వామ్య యాత్రకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి, స్వయం పాలనలో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ పార్లమెంట్ భవనం గురించి అందరికీ తెలసిందే. దాదాపు వందేళ్లుగా శాసనాలు రూపొందిస్తూ.. పాలనకు ఆవాలంగా నిలుస్తున్న ఈ పార్లమెంట్ భవనం ఇకపై మూగబోనుంది. కొత్త భవనానికి పార్లమెంట్ ను తరలించడంతో.. ఇది నిరుపయోగంగా మారబోతోంది. 

ఘన చరిత్ర కల్గిన పార్లమెంట్ భవనం

పాత పార్లమెంట్ భవనాన్ని 1927 జనవరి 18వ తేదీన అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. 1956లో దానిపైనే మరో రెండు అంతస్థులను కట్టారు. 2006లో పార్లమెంట్ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 2500 నాటి భారతదేశ ప్రజస్వామ్య వారసత్వం కనిపిస్తుంది. మొత్తం 6 ఎకరాల్లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే విలక్షణమైనదిగా ప్రసిద్ధి చెందింది. అయితే స్వాతంత్ర్యానంతరం ఈ భవనంలో తొలి సమావేశం 1946 డిసెంబర్ 9వ తేదీన ఇదే భవనంలోని సెంట్రల్ హాల్ లో జరిగింది. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఆ తర్వాత వలస పాలన, రెండో ప్రపంచ యుద్ధం, స్వాతంత్ర్య ఉషస్సు, రాజ్యాంగ ఆమోదం లాంటి మైలు రాళ్లకు ఇది సాక్షిగా నిలిచింది. 

Read Also: Special Parliament Session: ప్రత్యేక అజెండాతో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు- ఏ క్షణం ఏదైనా జరగొచ్చని అంచనాలు

నేటి నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈ సమావేశాల కోసం ప్రత్యేక అజెండా ఖరారు చేసిన ఏ క్షణం ఏ బిల్లు టేబుల్ చేస్తారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఒకటి రెండు కీలకమైన బిల్లు సభలో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం ఆలోచన చేస్తుందని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

తొలిరోజు సమావేశాలు పాత బిల్డింగ్‌లోనే జరుగుతాయి. ఆ తరవాత రేపటి నుంచి(సెప్టెంబర్ 19న) కొత్త బిల్డింగ్‌లోకి షిఫ్ట్ అవుతున్నట్టు కేంద్రం ఇప్పటికే వెల్లడించింది.  జూన్1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌ని ప్రారంభించారు. మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులోనే Sengolని ఏర్పాటు చేశారు. 

ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation,One Election)పైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్‌ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.  
కేంద్రం విడుదల చేసిన ఈ నెల 18న 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణంపై చర్చించనున్నట్టు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు వేర్వేరుగా బులెటిన్లు విడుదల చేశాయి. రాజ్యసభలో రెండు, లోక్‌సభలో రెండు బిల్లుపై చర్చ జరగనుంది. 

ప్రత్యేక సమావేశాల్లో తొలి రోజు  75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై చర్చ జరగనుంది. రాజ్యసభలో కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించేలా కేంద్రప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. గత నెల 10న రాజ్యసభలో ప్రవేశపెట్టింది. నియామక ప్యానెల్‌లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్‌ చేసిన కేంద్ర కేబినెట్‌ మంత్రి ఒకరు... ఇందులో సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ నుంచి సీజేఐను తొలగించింది. దీంతో ఈ నియామక ప్రక్రియ వివాదాస్పదమైంది. 

ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేట్ కార్యకలాపాలు ఉండవని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌ల నుంచి ఇటీవలే అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. సెషన్‌లో ఐదు సిట్టింగ్‌లు ఉంటాయి. సభ్యులు విడిగా తాత్కాలిక క్యాలెండర్‌ని అందుకుంటారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adani Stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
Tamannaah Bhatia : అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
Zomato: జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
Bank Locker Rules: బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Embed widget