Rishabh Pant:: తొలిసారి ఐపీఎల్ ఆక్షన్ ప్రక్రియలో యాక్టివ్ కెప్టెన్- రికార్డు సృష్టించబోతున్న పంత్
IPL 2023 Auction News: ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ యాక్టివ్ కెప్టెన్ కూడా వేలం ప్రక్రియలో పాల్గొనలేదు. కానీ ఈసారి పంత్ అలా చేయబోతున్నాడు.
IPL 2023 Auction News: దుబాయ్‌లో ఐపీఎల్ వేలం కోసం రంగం సిద్ధమైంది. అన్ని జట్లూ తమ స్ట్రాటజీలతో రెడీగా ఉన్నాయి. అయితే ఈసారి దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆక్షన్ టేబుల్ చాలా అట్రాక్ట్ చేసే అవకాశముంది. ఎందుకంటే టీమ్ మేనేజ్మెంట్‌తో పాటుగా కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ప్రక్రియలో పాల్గొనబోతున్నాడు కాబట్టి. ఈ రకంగా పంత్ ఓ రికార్డు సృష్టించబోతున్నాడు.
ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ యాక్టివ్ కెప్టెన్ కూడా వేలం ప్రక్రియలో పాల్గొనలేదు. కానీ ఈసారి పంత్ అలా చేయబోతున్నాడు. ఫ్రాంచైజీ ఓనర్స్, కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి స్ట్రాటజీలు వేసిన పంత్, వేలంలో ఎవర్ని కొనాలో విలువైన సలహాలు ఇవ్వబోతున్నాడు. దీనిపై ఐపీఎల్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి పంత్ గురించి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ అయింది.
ఇలాంటి ఎక్స్ పీరియన్స్ తనకు కూడా ఇది మొదటిసారని పంత్ చెప్పుకొచ్చాడు. తమకు కావాల్సినది వేలంలో దక్కించుకుంటామని పంత్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. తన యాక్సిడెంట్ నుంచి రికవరీ దాకా ఎంతో ప్రేమను అందించిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు