Breaking News Live: ఈ నెల 12న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 7న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 7న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ఈ నెల 12న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం
ఈ నెల 12న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం కానుంది. కృష్ణా నదిపై కేంద్ర జల్‌శక్తిశాఖ గెజిట్ అమలుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. కేంద్ర జలశక్తిశాఖ జులై 15న జారీ చేసిన నోటిఫికేషన్ ఈ నెల 14 నుంచి అమల్లోకి రావల్సి ఉంది. ఈలోగా అందుకు సంబంధించి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే రెండు రాష్ట్రాల నుంచి పూర్తి సమాచారం ఇంకా బోర్డులకు అందలేదు. నిర్వహణ కోసం కావాల్సిన సమాచారం కూడా ఇవ్వలేదు. నోటిఫికేషన్‌లోని కొన్ని ప్రాజెక్టులను రెండో షెడ్యూల్ నుంచి తొలగించాలని రెండు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమలు కార్యాచరణ దిశగా ఇప్పటి వరకు జరిగిన కసరత్తు, రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం సహా అన్ని అంశాలపై కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కేంద్ర జలశక్తి శాఖ గురువారం సమీక్షించింది.
నిజామాబాద్ జిల్లాలో దారుణం.. చాక్లెట్ల ఆశ చూపి ఇద్దరు బాలికలపై అత్యాచారం
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలకు ఓ వ్యక్తి చాక్లెట్ల ఆశ చూపి అత్యాచారం చేశాడు. ఐదు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.





















