Pakistani actress: పాకిస్తాన్‌లో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్న సినీ నటి - ఇక అక్కడి వాళ్లు వదులుతారా ?
Sonya Hussaiyn: దీపావళి పండుగ అంటే అంటే అన్ని మతాల వారికీ పండుగే. పూజల సంగతి పక్కన పెడితే హుషారుగా దీపాలు వెలిగించడం, జటపాసులు కాల్చడం వంటివి చేస్తారు. పాకిస్తాన్‌లోనూ చేశారు.
Pakistani actress Sonya Hussaiyn trolled for celebrating Diwali: పాకిస్థాన్‌లో హిందూ పండుగలు చేసుకోవడానికి ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువులు చాలా ఇహ్బబంది పడతారు. ఎందుకంటే అక్కడి పరిస్థితులు అలా ఉంటాయి. పాకిస్థానీలే అయినా హిందువుల్ని హిందువులుగా బతకనీయరన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో హిందూ పండుగలకు అక్కడ పెద్దగా సందడి కనిపించదు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని మార్పులు వస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ సినీ నటి సోన్యా హుస్సేన్ దీపావళి పండుగను భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇల్లంతా దీపాలు వెలిగించారు. బంధువులతో కలిసి టపాసులు కాల్చారు. మిఠాయిలు పంచుకున్నారు.
సోన్యా హుస్సేన్ తన దీపావళి సంబరాలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆ వీడియో వైరల్ అయిపోయింది.
View this post on Instagram
ఓ మస్లిం అయి ఉండి అదీ కూడా ఓ పాకిస్తాన్ వాసి అయి ఉండి.. హిందువుల పండుగ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటావా అని ఆమెను పాకిస్తాన్ ప్రజలు ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే సోన్యా హుస్సేన్ మాత్రం పట్టించుకోలేదు. హిందువుల్ని కూడా గౌరవించాలన్నారు. పాకిస్తాన్‌లో మైనారిటీలుగా ఉన్న వారి కమ్యూనిటీని కూడా గౌరవించాలన్నారు.
Pakistani actor sonya hussyn celebrated Diwali and the comments under her post by Muslims abusing her shows exactly the exclusive jihadi mindset of an average Islamist https://t.co/d7ImD6RZux pic.twitter.com/7nGrfhxIBg
— Svadharma (@Svadharma11) November 3, 2024
అయితే సోన్యా హస్సేన్‌కు చాలా మంది నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అతి కొద్ది మంది మత చాందసవాదులు మాత్రమే విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా సోన్యా హుస్సేన్ హాట్ టాపిక్ అయ్యారు. పాకిస్తాన్‌కి చెందిన ముస్లిం ఫ్యాన్స్ ఎక్కవ మంది సోన్యా హుస్సేన్ తీరును ఖండించారు. ఆమెను అన్ ఫాలో చేస్తామన్నారు . అయితే కొద్ది మంది మాత్రం ఆమెను అభినందించారు. దీపావళి పండుగను సెలబ్రేట్ చేసకోవడం ఇస్లాంను ఏ మాత్రం కించ పరిచినట్లుగా కాదని అభిప్రాయం వ్యక్ం చేశారు.
దీపావళి పండుగను పాకిస్తాన్ లోని హిందువులు సెలబ్రేట్ చేసుకోవడానికి బయపడుతున్న సమయంలో ఓ నటి ధైర్యంగా తన కుటుంబసభ్యులతో కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగానే మైనార్టీ వర్గంగా ఉన్న హిందువులకు కొత్త ధైర్యాన్ని ఇచ్చిందని ఆ నటిని అభినందిస్తున్నారు. మిగిలిన వారు కూడా ఇలా హిందువులు, వారి పండుగలపై ద్వేషం పెంచుకోకుండా.. అందరూ పాకిస్తాన్ ప్రజలేనన్న వాస్తవాన్ని గుర్తించి సోదరభావంతో ఉండాలన్న సలహాలు ఇస్తున్నారు.