By: Ram Manohar | Updated at : 05 Feb 2023 02:08 PM (IST)
పాకిస్థాన్‌లో చమురు రంగం పూర్తిగా పతనమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
Pakistan Oil Companies:
ఏం చేద్దాం: పాక్ ప్రభుత్వం
పాకిస్థాన్ దారుణమైన స్థితిలో ఉంది. ఓ పూట తిండికీ అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చమురు విషయంలో సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆయిల్ కంపెనీలు అలెర్ట్ చేశాయి. ఆయిల్ ఇండస్ట్రీ పతనమయ్యే దశలో ఉందని తేల్చి చెప్పాయి. ఫారెక్స్ నిల్వలు లేకపోవడం, రోజురోజుకీ పాకిస్థాన్ కరెన్సీ విలువ పడిపోతుండటం వల్ల సంక్షోభం తప్పేలా లేదని వివరించాయి. మరి కొద్ది రోజుల్లో ఆయిల్ ఇండస్ట్రీ పూర్తిగా కుప్ప కూలిపోతుందని వెల్లడించాయి. ఇప్పటికే దేశంలోని పరిస్థితులు చేసి షెహబాజ్ సర్కార్ చేతులె త్తేసింది. ఏం చేయాలో పాలు పోక తలలు పట్టుకుంటోంది.
ఉన్న అప్పులు తీర్చలేక..కొత్త అప్పులు పుట్టక నానా అవస్థలు ( Pakistan Crisis ) పడుతోంది. IMF ఆదుకుంటుంది అనుకుంటే..అది కూడా జరిగేలా కనిపించడం లేదు. వీటికి తోడు చమురు రంగం పూర్తిగా పతనం అవుతుండటం మరింత కలవర పెడుతోంది. స్థానిక కరెన్సీ విలువ దారుణంగా పడిపోవటం వల్ల బిలియన్‌ల కొద్ది ఆర్థిక నష్టం వాటిల్లింది. ఫారెక్స్ నిల్వలు అడుగంటుతున్నాయి.
బిలియన్‌ల నష్టం..
ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలంటూ IMFని అర్థిస్తోంది పాకిస్థాన్. కానీ...IMF మాత్రం చాలా విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది. 7 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు సిద్ధంగానే ఉన్నా...అందుకు తగ్గ అర్హతలన్నీ పాక్‌కు ఉన్నాయా లేదా అని సమీక్షిస్తోంది. ఈ లోన్ ఇచ్చేందుకు ఇప్పటికే 8 సార్లు పాక్‌కు వచ్చిన IMF బృందం...ఇప్పుడు తొమ్మిదో సారీ సమీక్ష జరుపుతోంది. దీనిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఆర్థిక మంత్రి ఇషాక్ దర్‌కు IMFని ఎదుర్కోటం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తమకు గడ్డు కాలం అంటూ వ్యాఖ్యానించారు.
"ప్రస్తుతం మేం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాలు ఎప్పుడూ ఊహించనిది. IMF చెప్పిన కండీషన్స్‌ని రీచ్ అవడం మా శక్తికి మించి పనిగా అనిపిస్తోంది. కానీ...మాకు వేరే మార్గం లేదు. కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సిందే"
- షెహబాజ్ షరీఫ్, పాక్ ప్రధాని
IMF రివ్యూ..
రుణ భారం మోయలేక పాక్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. IMFరివ్యూ జరిగిన ప్రతిసారీ గండం దాటినట్టే ఉంటోందని పాక్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశ మారక ద్రవ్య నిల్వలు 3.09 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. మరో 18 రోజుల పాటు దిగుమతులకు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. ఆ తరవాత పరిస్థితి ఏంటన్నది ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. IMF రివ్యూఆధారంగా చూస్తే... పాక్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పెట్రోల్ రేట్లను 16% పెంచాలి. ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్నీ (LPG Cylinder Price) 30% పెంచాలి. వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. కానీ.. IMF మాత్రం ఈ కండీషన్స్ ఓకే అంటేనే లోన్ ఇస్తామని తేల్చి చెబుతోంది. నేషనల్ గ్రిడ్‌లో ఏర్పడ్డ సమస్యల కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తింది.
TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్ కుమార్ డిమాండ్
1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?