Pakistan lost: చైనా సరుకుని నమ్ముకుని మునిగిన పాకిస్తాన్ - రష్యా మిస్సైల్స్‌తో కకావికలం చేసిన భారత్
India Pakistan Tensions: చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను నమ్ముకుని పాకిస్తాన్ నష్టపోయింది. రష్యా మేడ్ మిస్సైల్‌తో భారత్ పాకిస్తాన్ కు కాళరాత్రిని మిగిల్చింది.

Chinese air defense system Fail: చైనా సరుకు అంటే నాసిరకం అనే ముద్ర ఉంది. పాకిస్తాన్ లాంటి దేశాలకు అప్పుగా ఇచ్చే సరుకు మరింత నాసిరకంగా ఉంటుందని చైనా నిరూపించింది. పాకిస్తాన్ తన గగనతల రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి చైనా నుండి అనేక అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను సమకూర్చుకుంది. అవన్నీ ఫెయిలయ్యాయి. చైనా-సరఫరా చేసిన సిస్టమ్‌లు పూర్తిగా విఫలమయ్యాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ఖచ్చితమైన దాడులు జరిపింది. ఇందులో చైనా HQ-9, LY-80 వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు ఒక్క భారతీయ మిస్సైల్‌ను కూడా అడ్డుకోలేకపోయాయి.
HQ-9/P చైనా రూపొందించిన లాంగ్-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్. రాడార్ సిస్టమ్‌లు భారతదేశం ఉపయోగించిన స్టీల్త్ లేదా లో-ఫ్లైయింగ్ మిస్సైళ్లను గుర్తించలేకపోయాయి. సిస్టమ్‌లు ట్రాక్ చేయగలిగినప్పటికీ, సకాలంలో ఎంగేజ్ చేయడంలో విఫలమయ్యాయి, భారత వైమానిక దళం జైష్-ఎ-మొహమ్మద్ శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఈ సిస్టమ్‌లు సమర్థవంతంగా స్పందించలేదు. ఆపరేషన్ సిందూర్ చైనా సైనిక హార్డ్‌వేర్, ముఖ్యంగా ఎగుమతి-గ్రేడ్ సిస్టమ్‌ల విశ్వసనీయతపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తింది. చైనా టెక్నాలజీపై పాకిస్తాన్ యొక్క అతిగా ఆధారపడటం రక్షణ వ్యవస్థలలో బలహీనతలను బహిర్గతం చేసింది,.
మరో వైపు పాకిస్తాన్ మోహరించుకున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ డ్రోన్లతో నాశనం చేసింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను రష్యా తయారు చేసిన S-400 వ్యవస్థ సామర్థ్యాలను ఉపయోగించుకుని, భారత దళాలు నాశనం చేశాయి. అంతేకాదు అనేక ప్రదేశాలలో పాకిస్తాన్ వైమానిక రక్షణ రాడార్లు , వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. లాహోర్,కరాచీలలో దాడులు చేసింది. వైమానిక రక్షణ వ్యవస్థపై దాడి చేసి పాకిస్తాన్‌ను దెబ్బతీసింది.
BREAKING:
— News & Statistics (@News_Statistic) May 8, 2025
Reuters reports says Pakistan’s Air defence (China HQ-9) at Lahor completely destroyed by Indian drone.
China won’t be happy with Pakistan. pic.twitter.com/IpAuRNvEKt
భారత సుదర్శన చక్రం
రష్యాకు చెందిన అల్మాజ్-ఆంటె అభివృద్ధి చేసిన S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ ఉపయోగిస్తోంది. ఇది సుదర్శన చక్రం లాంటిది.
S-400 అనేది ఒక మొబైల్ లాంగ్-రేంజ్ ఉపరితలం నుండి గగనతలానికి క్షిపణి వ్యవస్థ.
స్టెల్త్ ఫైటర్ జెట్‌లు, బాంబర్లు, క్రూయిజ్ , బాలిస్టిక్ క్షిపణులు , మానవరహిత వైమానిక వాహనాలు (UAVలు) వంటి వివిధ రకాల వైమానిక లక్ష్యాలను కూల్చివేసే సామర్థ్యం దీని సొంతం. .
దీనికి రెండు రాడార్ వ్యవస్థలు ఉన్నాయి, ఇవి 600 కిలోమీటర్ల దూరం వరకు వైమానిక లక్ష్యాలను గుర్తించగలవు. ఒకేసారి 80 వైమానిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోగలవు.
ఈ వ్యవస్థను వేరే ప్రదేశానికి తరలించినప్పుడు దాదాపు 15 నిమిషాల్లోనే రెడీ చేయవచ్చు. 3 నిమిషాల్లోనే కాల్పులు జరపడానికి సిద్ధం చేయవచ్చు.
ఇది లక్ష్య గుర్తింపు కోసం జామ్-రెసిస్టెంట్ పనోరమిక్ రాడార్ వ్యవస్థతో ఉంటుంది. వివిధ రకాల క్షిపణులు , కొన్ని లాంచర్‌లతో క్షిపణి ప్రయోగ కేంద్రాల ఉంటాయి.
భారతదేశం , రష్యాతో పాటు, చైనా, టర్కీ మరియు బెలారస్ ఈ వ్యవస్థను ఉపయోగిస్తాయి.





















