Pakistan Economic Crisis- పాకిస్థాన్ మరో శ్రీలంకగా మారనుందా..?
పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. ఆర్థిక వ్యవస్థను చక్క దిద్దేందుకు అక్కడి ప్రభుత్వం ధరల బాదుడు విధానాన్నే నమ్ముకుంది. ఆహార పదార్థాల నుంచి పెట్రో ఉత్పత్తుల వరకూ అన్నీ ప్రియమైపోయాయి.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో ప్రపంచమంతా గమనిస్తూనే ఉంది. ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకుంది. ఓ పూట తిండి తినేందుకూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మన దాయాది దేశం పాకిస్థాన్ దుస్థితీ ఇలానే ఉంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయే నాటికే పాక్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది. దేశం అప్పుల కుప్పగా మారింది. తీసుకున్న అప్పులు కట్టలేక, కొత్త అప్పు పుట్టక తిప్పలు పడుతోంది పాకిస్థాన్.
అంచనాలకు మించిన ద్రవ్యోల్బణం
ఈ ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 13.37% గా నమోదైంది. మే నాటికి ఇది 13.8%కి పెరిగింది. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సరుకుల ధరలపెరిగిపోయాయి. ఫలితంగా ఆహార పదార్థాలు ప్రియంగా మారాయి. కరెన్సీ విలువ రోజురోజుకీ పడిపోతోంది. ఈ పరిస్థితులు చక్కదిద్దేందుకు పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంకు రంగంలో దిగింది. వడ్డీ రేట్లను 675 బేస్ పాయింట్లు పెంచింది. ఆహార పదార్థాల ధరలు 17.3% మేర పెరిగాయంటే అక్కడ సరుకుల ధరల ఏ విధంగా మండిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
పెట్రో ధరల మంట
వీటికి తోడు పెట్రోల్ ధరలూ పరుగులు పెడుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా ౩౦ రూపాయల మేర పెంచింది పాక్ సర్కార్. పెరిగిన ధరలతో చూసుకుంటే లీటర్ పెట్రోల్ ధర 179 రూపాయలకు పైగానే ఉండగా, లీటర్ డీజిల్ ధర 174 రూపాయలకు పైగానే పలుకుతోంది. ఆ దేశ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి-IMFతో చర్చలు జరిగిన తరవాతే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే పెట్రో ఉత్పత్తులపై రాయితీలు తీసేయాలని సూచించింది ఐఎమ్‌ఎఫ్. కానీ ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆ సూచనండా స్ను పట్టించుకోకుండా
ధరలు పెంచకుండా స్థిరంగా ఉండేలా చూశారు. ఎప్పుడైతే ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారో అప్పటి నుంచి పెట్రో ధరల బాదుడు మొదలైంది.
ంది.
ప్రజలకు కరెంట్ షాక్..!
పెట్రో ధరల పెంపుతోనే పాకిస్థాన్ ప్రజలు సతమతం అవుతుంటే ఇప్పుడు మరో బాదుడుకి సిద్ధమవుతోంది ప్రభుత్వం. యూనిట్‌కి ఏకంగా 7 రూపాయల మేర పెంచేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఐఎమ్‌ఎఫ్ సూచనల మేరకు ప్రభుత్వ పరిధిలోని డిస్కమ్‌లను ప్రైవేటీకరణ చేసింది పాక్ సర్కార్. ఇప్పుడు కరెంట్ ఛార్జీలనూ పెంచాలని నిర్ణయించుకుంది.
ఈ నిర్ణయాలు ఐఎమ్‌ఎఫ్ రుణం కోసమేనా..?
పలు దేశాలు పాకిస్థాన్‌కు సాయం చేసేందుకు ముందుకొస్తున్నప్పటికీ పాకిస్థాన్ చూపు మాత్రం IMFవైపే ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ భద్రంగా ఉండాలంటే అది IMFద్వారానే సాధ్యమవుతుందని పాక్ బలంగా నమ్ముతోంది.
పాకిస్థాన్ డాలర్ బాండ్‌ల విలువ దారుణంగా పడిపోయిన సందర్భంలో పెట్రో ధరలు పెంచింది పాకిస్థాన్. ఇలా పెంచమని సలహా ఇచ్చింది IMFసంస్థే. ఇలా చేస్తే తప్ప ఆ సంస్థ నుంచి నిధులు పొందేందుకు పాకిస్థాన్‌కు అర్హత సాధించలేదు. అందుకే షెహబాజ్ షరీఫ్ ఆ నిర్ణయం తీసుకున్నారు.
ఇలా అయితే గానీ పాక్ పాట్లు తీరవు
ఇప్పటికిప్పుడు 36 నుంచి 37 బిలియన్ డాలర్ల నిధులు అందితే తప్ప పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం తీరేలా లేదన్నది అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం. ఒక్కసారి IMFతో ఒప్పందం కుదిరితే
ప్రపంచ బ్యాంకు సహా చైనా లాంటి దేశాలు పాకిస్థాన్‌కు సహకరించేందుకు ముందుకొచ్చే అవకాశముంటుంది. తద్వారా ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు. అందుకే IMF సూచనల మేరకు నడుచుకుంటూ
ప్రజలపై ధరాభారం మోపుతోంది పాకిస్థాన్ ప్రభుత్వం. మరి ఈ నిర్ణయాలు పాక్‌ను గట్టెకిస్తాయో లేదో చూడాలి.