Viral News: ఏడాదికి పది లక్షల ఇన్‌కంట్యాక్స్ కట్టాడు-ఇప్పుడు లే ఆఫ్- సపోర్ట్ ఏది? ఈ టెకీ ప్రశ్నలకు ప్రభుత్వ వద్ద సమాధానం ఉంటుందా ?
Bengaluru Techie: ఓ బెంగళూరు టెకీ ఏడాదికి పదకొండు లక్షల చొప్పున ప్రభుత్వానికి ఆదాయపు పన్ను కట్టేవాడు. ఇప్పుడు ఉద్యోగం పోయింది. ప్రభుత్వం నుంచి సపోర్టు కోరుతున్నాడు.

Bengaluru Techie Problems: ఆదాయం సంపాదించేటప్పుడు ప్రభుత్వానికి లక్షలు లక్షలు పన్నులు కడతాం. మరి ఆదాయం కోల్పోయినప్పుడు.. ఉద్యోగం కోల్పోయినప్పుడు ప్రభుత్వం ఏమైనా సపోర్టు చేస్తుందా ? అన్న డౌట్ చాలా మందికి వస్తుంది. కానీ అలాంటి అవకాశమే లేదు. బెంగళూరులో ఓ టెకీ ఇప్పుడు ఇదే నిర్వేదంలో ఉన్నారు. అతనికి సంబంధించిన కథ ఇప్పుడు వైరల్ అవుతోంది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో చదువుకున్న సలీం అనే వ్యక్తి.. తర్వాత ఉద్యోగంలో చేరి అసాధారణ ప్రతిభావంతునిగా పేరు తెచ్చుకున్నాడు. సంవత్సరానికి రూ. 43.5 లక్షల జీతం అందుకునేవాడు. అయితే హఠాత్తుగా ఆయన పని చేస్తున్న ఎమ్మెన్సీ ఉద్యోంగ నుంచి తొలగించింది. సలీం ఐదు సంవత్సరాలలో రూ. 30 లక్షలకు పైగా ఆదాయపు పన్ను చెల్లించారు, ఇందులో గత సంవత్సరంలో రూ. 11.22 లక్షలు ఉన్నాయి.
ఇప్పుడు నిరుద్యోగిగా ఉన్న సలీం గతంలో పన్నులు కట్టగా మిగుల్చుకున్న సొమ్ముతో పిల్లల ఫీజులు కట్టుకుని .. కుటుంబాన్ని నడుపుకుంటున్నాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. పిల్లల ఫీజులకు దాదాపుగా రెండు లక్షలు చెల్లించాల్సి వస్తోంది. లక్షలకు లక్షలు పన్నులు కట్టిన సలీం ప్రభుత్వం నుంచి కొంత సపోర్టు కోరుకుంటున్నాడు.
భారతదేశంలో నిజమైన పన్ను చెల్లింపుదారులకు అన్యాయం జరుగుతోందని.. నిజాయితీగా పన్నులు చెల్లించినా సంక్షోభంలో ఉన్నప్పుడు కనీస సాయం ఉండదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Just got a message from Mr. Salim a topper from his NIT, working in Bangalore with a ₹43.5 LPA package laid off last month. The company handed him just 3 months’ severance.
— Venkatesh Alla (@venkat_fin9) June 29, 2025
Last year alone, he paid ₹11.22 lakhs in income tax. In just 5 years, over ₹30 lakhs gone into the…
సలీం గురించి వెంకటేష్ అనే వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్ అయింది. జీతం నుంచి ఆదాయపు పన్ను చెల్లించే వారిలో ఉద్యోగ నష్టం సమయంలో ఆర్థిక సహాయం అందించడానికి నిర్మాణాత్మక నిరుద్యోగ భృతి, సంబంధిత భావోద్వేగ ఇబ్బందులను పరిష్కరించడానికి మానసిక ఆరోగ్య కార్యక్రమాలు , జీతం పొందేవారికి స్పష్టమైన రాబడిని అందించే పన్ను సంస్కరణలు, సంక్షోభ సమయాల్లో భద్రతా వలయాన్ని అందించడం వంటి కీలక సంస్కరణలు అవసరం అని నెటిజన్లు అంటున్నారు.
So, by your logic, taxpayers should just keep paying lakhs year after year without expecting basic dignity, security, or support in times of crisis?
— Venkatesh Alla (@venkat_fin9) June 30, 2025
We're not asking for “insurance.” We’re demanding accountability from a system that thrives off the sweat of 1-2% income…





















