Trump: చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు, తెలివి తక్కువవాడు - న్యూయార్క్ మేయర్ పదవి కోసం పడుతున్న భారతీయుడిపై ట్రంప్ నోటి దురుసు
New York Mayor: న్యూయార్క్ మేయర్ పదవి కోసం పోటీపడుతున్న వారిలో ఓ భారతీయ అమెరికన్ ఉన్నారు. దీంతో ట్రంప్ ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

New York Indian Origin Mayor Candidate: భారతీయ మూలాలున్న అమెరికన్లపై ట్రంప్ తన నోటి దురుసును ఆపడం లేదు. ప్రస్తుతం న్యూయార్క్ కు మేయర్ ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. న్యూయార్క్ నగరంలో జరిగిన డెమోక్రటిక్ మేయర్ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వామపక్ష సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ పోటీ పడుతున్నారు. ముందడుగు వేస్తున్నారు. అందుకే అతను 100 శాతం కమ్యూనిస్ట్ పిచ్చివాడని ట్రంప్ తేల్చేశారు. న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో జోహ్రాన్‌ను సమర్థించారు. జోహ్రాన్‌కు మద్దతిచ్చే వారిని కూడా ట్రంప్ వదల్లేదు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు.
డెమొక్రాట్లు గీత దాటారని.. 100 శాతం కమ్యూనిస్ట్ పిచ్చివాడైన జోహ్రాన్ మమ్దానీ డెమ్ ప్రైమరీని గెలుచుకున్నాడు , మేయర్ అయ్యే మార్గంలో ఉన్నాడని అంటున్నారు. 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ పై ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మమ్దానీ "భయంకరంగా కనిపిస్తున్నాడు, అతని గొంతు గజిబిజిగా ఉంది, అతను అంత తెలివైనవాడు కాదు, అతనికి AOC+3 ఉంది, డమ్మీస్ అందరూ అతనికి మద్దతు ఇస్తున్నారు. ఇది మన దేశ చరిత్రలో ఒక గొప్ప క్షణం!" అని సెటైరిక్‌గా వ్యాఖ్యలుచేస్తున్నారు.
డెమొక్రాట్లు "అధ్యక్ష పదవికి తక్కువ తెలివితేటలు కలిగిన అభ్యర్థి, జాస్మిన్ క్రోకెట్" ను తిరిగి నామినేట్ చేయాలని ఆయన ఎగతాళి చేస్తూ అన్నారు. ప్రఖ్యాత భారతీయ అమెరికన్ చిత్రనిర్మాత మీరా నాయర్ , భారతదేశంలో జన్మించిన ఉగాండా మార్క్సిస్ట్ పండితుడు మహమూద్ మమ్దానీ కుమారుడు మమ్దానీ. న్యూయార్క్ నగర మేయర్ ప్రాథమిక ఎన్నికలలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. మమ్దానీ 43.5 శాతం ఓట్లను గెలుచుకున్నాడు. చివరి రేసులో మమ్దానీ గెలిస్తే, అతను న్యూయార్క్ మొదటి ముస్లిం మేయర్ అవుతాడు.
BREAKING - Some Republican voters are now calling on President Trump to use the Communist Control Act of 1954 to stop Zohran Mamdani from becoming Mayor of New York, while others argue over the constitutionality of such a move. pic.twitter.com/nP40V7J8AA
— Right Angle News Network (@Rightanglenews) June 25, 2025
భారతీయ సంతతికి చెందిన వలసదారుల కుమారుడు, అతనికి డెమొక్రాటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా పార్టీ మద్దతు ఇస్తుంది . చాలా మంది డెమొక్రాటిక్ నాయకులు వామపక్ష అనుబంధం కలిగి ఉన్నారు. మమ్దానీ పాలస్తీనియన్ల తరపున మాట్లాడుతున్నారు. అందుకే ట్రంప్ ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం క్వీన్స్ బరోకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా ఉన్న మమ్దానీ న్యూయార్క్ వాసులను పలు హామీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. న్యూయార్క్ వాసులకు అద్దె కష్టాలు తొలగించడం, ఉచిత బస్సు, పిల్లల సంరక్షణ వంటి హామీ ఉన్నాయి. ఇవి అక్కడి ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి.





















