అన్వేషించండి

B 2 stealth Bombers: ఇరాన్‌పై దాడి వీడియోలు రిలీజ్ చేసిన పెంటగాన్ - మొత్తం 37 గంటల ఆపరేషన్ !

Pentagon: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి వీడియోను పెంటగాన్ విడుదల చేసింది. బయలుదేరడం.. మళ్లీ ల్యాండ్ అయ్యే వీడియోలు ఉన్నాయి.

Pentagon releases video of US attack on Iran nuclear sites: ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ పేరుతో అమెరికా సైన్యం ఇరాన్‌లోని మూడు కీలక న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేసింది. ఫోర్ , నటాంజ్ ,  ఇస్ఫహాన్  B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌లు బాంబుల వర్షం కురిపించాయి.  పెంటగాన్ జూన్ 24, 2025న ఈ ఆపరేషన్‌కు సంబంధించిన అధికారిక వీడియో ఫుటేజ్‌ను విడుదల చేసింది, ఇందులో B-2 బాంబర్‌లు వైట్‌మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి బయలుదేరడం, దాడి అనంతరం తిరిగి వచ్చే దృశ్యాలు ఉన్నాయి.  

జూన్ 21, 2025 అర్ధరాత్రి దాటిన తర్వాత మిస్సోరీలోని వైట్‌మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి B-2 బాంబర్‌లు బయలుదేరాయి.  ఇది B-2 చరిత్రలో రెండవ అత్యంత దీర్ఘమైన మిషన్ అనుకోవచ్చు. మొదటి సారి 2001లో ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ మొదటి స్థానంలో ఉంది.  ఇరాన్ న్యూక్లియర్ సామర్థ్యాన్ని నాశనం చేయడానికి ఈ ఆపరేషన్ ను నిర్వహించారు.  అమెరికా చరిత్రలో అతిపెద్ద B-2 దాడి గా  చెప్పుకోవచ్చు. 

ఇందులో 125కు పైగా అమెరికా యుద్ధ  విమానాలు పాల్గొన్నాయి, ఇందులో ఏడు B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌లు,  F-22 రాప్టర్‌లు, F-35 లైటనింగ్ IIలు  ఉన్నాయి. ఎయిర్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్‌లు, ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్,  ISR  విమానాలు, ఒక గైడెడ్ మిసైల్ సబ్‌మెరీన్ కూడా ఈ ఆపరేషన్ లో పాలు పంచుకున్నాయి.  ఏడు B-2 బాంబర్‌లు ఇరాన్‌పై దాడి చేయడానికి  ఎటువంటి సమాచారం లీక్ కాకుండా మినిమల్ కమ్యూనికేషన్ తో 18 గంటల పాటు ఎట్లాంటిక్ , మధ్యధరా సముద్రం గుండా ప్రయాణించాయి. అదే సమయంలో, మరో ఆరు B-2లు  గ్వామ్‌లోని ఆండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు పసిఫిక్ మీదుగా పశ్చిమ దిశగా ఎగిరాయి. ఇది ఇరాన్ , ఇతర ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ కు తప్పుదోవ పట్టించే వ్యూహంతో అమలు చేశారు.  

ఏడు B-2 బాంబర్‌లు 14 GBU-57 MOPలను ఇరాన్ అణు కేంద్రాలపై జార విడిచాయి, ఇవి రాక్ లేదా కాంక్రీట్‌లో 200 అడుగుల లోతు వరకు చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగిన బంకర్ బస్టర్ బాంబులు. తర్వాక, B-2లు వైట్‌మన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు తిరిగి చేరుకున్నాయి. 11,400 కిలోమీటర్లు ప్రయాణించాయి. అనేక సార్లు  ఇన్-ఫ్లైట్ రీఫ్యూయలింగ్‌లతో 37 గంటల మిషన్‌ను పూర్తి చేశాయి. ఇజ్రాయెల్ గత 10 రోజులుగా ఇరాన్  ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను గణనీయంగా ధ్వంసం చేసినందున గగన మిసైళ్లు అమెరికన్ విమానాలను గుర్తించలేదు.
 
పెంటగాన్ విడుదల చేసిన వీడియోలో B-2 స్పిరిట్ బాంబర్‌లు వైట్‌మన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లోని హ్యాంగర్‌ల నుండి బయలుదేరడం, జూన్ 21 అర్ధరాత్రి 12:01కి టేకాఫ్ చేయడం,  జూన్ 22 ఉదయం తిరిగి ల్యాండ్ అవడం  ఉన్నాయి.               

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget