By: Ram Manohar | Updated at : 04 Jun 2023 02:43 PM (IST)
ఒడిశా రైలు ప్రమాదంపై నిపుణుల కమిటీ వేసి విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. (Image Credits: ANI)
Odisha Train Accident:
సుప్రీంకోర్టులో పిటిషన్
ఒడిశా రైలు ప్రమాదంపై నిపుణులతో కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అంతే కాదు. దేశవ్యాప్తంగా అన్ని రూట్‌లలోనూ కవచ్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను రక్షించాలని ఇందులో ప్రస్తావించారు. విశాల్ తివారి అనే ఓ న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. Automatic Train Protection System కవచ్‌ని తక్షణమే అమలు చేసే విధంగా కేంద్రానికి మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని సుప్రీకోర్టుని విజ్ఞప్తి చేశారు. కవచ్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న వాదన ఇప్పటికే వినిపిస్తోంది. ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నాయి. ఈ రూట్‌లో కవచ్ ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ అంశం సుప్రీంకోర్టుకి చేరుకోవడం కీలకంగా మారింది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.
Odisha train accident: PIL in SC seeking probe by expert panel
Read @ANI Story | https://t.co/Uq9apzxzKE#SupremeCourt #OdishaTrainAccident #OdishaTrainTragedy #Odisha #BalasoreTrainAccident pic.twitter.com/P4yFefPlcb— ANI Digital (@ani_digital) June 4, 2023
కారణమిదే..
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మూల కారణాన్ని గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం వెల్లడించారు. ప్రమాద స్థలంలో ఉంటూ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి.. రైలు ప్రమాదానికి మూల కారణం తెలిసిందని, రైల్వే భద్రతా కమిషనర్ త్వరలోనే నివేదిక సమర్పించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 'ప్రమాదంపై విచారణ పూర్తయింది. రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ నివేదికను త్వరలోనే అందిస్తారు. ఆ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇప్పటికే ఈ ఘోర ప్రమాదానికి దారి తీసిన మూల కారణాన్ని గుర్తించాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. రైల్వే ట్రాక్ పునురద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని మృతదేహాలను గుర్తించి తొలగించాం. బుధవారం ఉదయానికి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేయడమే మా లక్ష్యం. ఆ దారిలో రైళ్లు ఎప్పట్లాగా నడవడానికి పరిస్థితులను చక్కదిద్దుతా'మని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
#WATCH | The root cause of this accident has been identified. PM Modi inspected the site yesterday. We will try to restore the track today. All bodies have been removed. Our target is to finish the restoration work by Wednesday morning so that trains can start running on this… pic.twitter.com/0nMy03GUWK
— ANI (@ANI) June 4, 2023
Also Read: Coromandel Express Accident: నాలుగేళ్లలో 11 వందలకుపైగా ప్రమాదాలు, అన్నింటికీ కారణమదే - కాగ్ రిపోర్ట్
Mancherial New: చెన్నూరులో గోదావరి తీరాన తాంత్రిక పూజల కలకలం, వ్యక్తి మృతి
CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష
Ram Sethu: రామసేతు వద్ద గోడ నిర్మించాలని పిల్- తిరస్కరించిన సుప్రీం
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Tiger Nageswara Rao Trailer: గజదొంగగా మాస్ మహారాజ వీరవిహారం, ‘టైగర్ నాగేశ్వర్ రావు’ ట్రైలర్ చూశారా?
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు, నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం
Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
CM Jagan To Delhi : ఆరో తేదీన ఢిల్లీకి సీఎం జగన్ - మోదీ, అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం !
/body>