(Source: Matrize)
Odisha News: ఫుల్లుగా సారా తాగేసి హాయిగా బజ్జున్న 24 ఏనుగులు!
Odisha News: ఒడిశాలో దాదాపు 24 ఏనుగులు.. నాటుసారా తాగేసి హాయిగా గాఢ నిద్రలోకి వెళ్లిపోయాయి.
Odisha News: ఒడిశాలోని అడవిలో దాదాపు 24 ఏనుగులు గంటల తరబడి నిద్రించాయి. నీళ్లు అనుకొని నాటుసారా తాగడం వల్లే ఇవి గాఢ నిద్రలోకి పోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
ఒడిశా కియోంజర్ జిల్లా పరిధిలోని అడవిలోకి స్థానిక గ్రామస్థులు వెళ్లారు. అక్కడ దొరికే కొన్ని పూలు, పండ్లతో 'మహువా' అనే సంప్రదాయక నాటు సారాను తయారు చేయడానికి అన్నీ సిద్ధం చేశారు. తొలుత వాటిని నానబెట్టి ఇంటికి వచ్చారు.
మరుసటి రోజు మంగళవారం తిరిగి అడవిలోకి వెళ్లారు. అయితే వీటిని నానబెట్టి ఉన్న కుండలు పగిలిపోయి ఉండటాన్ని చూసి షాకయ్యారు. కొంతదూరం వెళ్లి చూస్తే 24 ఏనుగులు గాఢ నిద్రలో ఉన్నాయి. కుండల్లోని నానబెట్టిన నీటిని ఏనుగులు తాగేశాయని గుర్తించిన గ్రామస్థులు.. అటవీ అధికారులకు సమచాారం ఇచ్చారు.
గ్రామస్థుల సమాచారంతో అటవీ అధికారులు అక్కడికి వెళ్లారు. అధికారులు భారీ శబ్ధం చేయడంతో ఏనుగులు లేచి వెళ్లిపోయాయి. ఏనుగుల గుంపు అప్పటికే మత్తెక్కించే పువ్వులతో పులియబెట్టిన నీటిని తాగినందుకే గాఢ నిద్రలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Viral Video: ఉడతలు కుర్‌కురే తింటాయా? ఎలా తినిపించావు నాయనా!