అన్వేషించండి

Odisha Vigilance Raid: ఈ ఉద్యోగి జీతం 6 వేలు - ఆస్తులు వందల కోట్లు - ఇలా అయితే ఎలా ?

Disproportionate Assets Case: ఒడిశాలో కేవలం 6 వేల జీతంతో చేరిన ఇంజనీర్ ఆస్తుల చిట్టా చూసి విజిలెన్స్ అధికారులు షాక్ అయ్యారు. 83 ఎకరాల భూమి, 5 భవనాలు సహా మరెన్నో ఆస్తులు కూడబెట్టాడు.

Odisha Government Corruption Crackdown:   ప్రభుత్వ సర్వీసులో జూనియర్ ఇంజనీర్‌గా చేరినప్పుడు ఆయన జీతం కేవలం  6,000 రూపాయలు . కానీ, సుమారు 25 ఏళ్ల సర్వీసు ముగిసేసరికి ఆయన కూడబెట్టిన ఆస్తులను చూసి అవినీతి నిరోధక శాఖ అధికారులే నోరెళ్లబెట్టారు. ఒడిశాకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  భువనేశ్వర్ శబర్  అక్రమాస్తుల బాగోతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  
 1999లో ఒడిశా ప్రభుత్వంలో జూనియర్ ఇంజనీర్‌గా అడుగుపెట్టిన భువనేశ్వర్ శబర్ ప్రస్థానం ఒక అద్భుతమైన ఎదుగుదలలా కనిపిస్తుంది, కానీ అది అవినీతి పునాదులపై నిర్మించిన సామ్రాజ్యం. ఈ వారం ఒడిశా విజిలెన్స్ శాఖ నిర్వహించిన దాడుల్లో ఆయనకు సంబంధించిన ఆస్తుల చిట్టా బయటపడింది. ఏకంగా  5 బహుళ అంతస్తుల భవనాలు, 97 ప్లాట్లలో విస్తరించి ఉన్న 83 ఎకరాల భూమి, 17 ఎకరాల్లో రెండు ఫామ్‌హౌస్‌లు,   ఒక భారీ మార్కెట్ కాంప్లెక్స్ చూసి అధికారులు అవాక్కయ్యారు.    

శబర్ తన కెరీర్‌లో అత్యధిక కాలం తన సొంత జిల్లా అయిన కలహండిలోనే  విధులు నిర్వహించారు.  2007 నుండి ఆయనకు రెండుసార్లు ప్రమోషన్లు వచ్చినా, తన పలుకుబడితో బదిలీ కాకుండా అక్కడే తిష్ట వేశారు. రోడ్లు ,భవనాల విభాగంలో పనిచేస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ భారీ ఆస్తులను కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విజిలెన్స్ అధికారులు ఆయన నివాసాల్లో 10.72 లక్షల రూపాయల డిపాజిట్లు, నగదు, ఖరీదైన కార్లు మరియు 20 లక్షల విలువైన గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. 

విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ ఆస్తులకు సంబంధించి శబర్ ఎటువంటి సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 2018 కింద అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆస్తుల విలువను లెక్కించే పనిలో టెక్నికల్ వింగ్ నిమగ్నమై ఉంది. ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగి ఇంత భారీ స్థాయిలో భూములు, భవనాలు ఎలా సంపాదించాడనే కోణంలో లోతైన దర్యాప్తు సాగుతోంది.

ఒడిశా ప్రభుత్వం అవినీతిపై చేపట్టిన ఉక్కుపాదం లో భాగంగా ఈ దాడి జరిగింది. 2025లో ఒడిశా విజిలెన్స్ ఏకంగా 205 కేసులు నమోదు చేయగా, అందులో 53 మంది క్లాస్-1 అధికారులపై చర్యలు తీసుకోవడం విశేషం. అవినీతి ఎంతటి వారినైనా వదలదనే సందేశాన్ని ఈ కేసు ద్వారా ప్రభుత్వం బలంగా పంపింది. శబర్ ఉదంతం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BCCI Message To Shami : బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
ABP Desam Top 10, 4 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 4 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Embed widget