అన్వేషించండి

Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!

Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్ పోక్సో కేసు మరో మలుపు తిరగబోతోంది. ఈయన చేతిలో మోసపోయిన బాధితులు మరికొందరు ఉన్నట్టు న్యాయవాదులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బండి భగీరథ్ పోక్సో కేసు: న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే కుట్ర.
  • హైకోర్టు న్యాయమూర్తి ప్రతిష్ట దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం: అరెస్టు.
  • సామాజిక మాధ్యమాల్లో బాధితుల వివరాలు బయటపెట్టి వేధింపులు.
  • భగీరథ్ చేతిలో మోసపోయిన మరికొందరు బాధితులు బయటకు రావచ్చు.

Bandi Bhagirath POCSO Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్‌ పోక్సో కేసు ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. బాధితుల సంఖ్య చాాలా ఉందని ఇప్పుడు కేసు పెట్టిన బాధితురాలు తరఫున వాదిస్తున్న న్యాయవాది కోర్టుకు చెప్పడం మరింత సంచలనంగా మారుతోంది. మరోవైపు  కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన కేసులో న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేలా, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై దుష్ప్రచారం చేసేలా సాగుతున్న కుట్రలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసులో హైకోర్టు న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బ తీసేలా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రధాన నిందితుడు రాయసం దామోదర్‌ (Rayasam Damodar Arrest) ను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఫోక్స్ కేసులో కేవలం ఒకరే కాకుండా, బండి భగీరథ్ చేతిలో మోసపోయిన వారు ఇంకా ఉన్నారనే విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. బాధితురాలి తరఫు న్యాయవాది పీవీ నాగేశ్వరరావు హైకోర్టు న్యాయమూర్తి మాధవీ దేవి ఎదుట ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భగీరథ్ చేతిలో మోసపోయిన మరో ఇద్దరు మైన్‌లు త్వరలోనే బయటకు వస్తారని, వారు కూడా భగీరథ్‌ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. గతంలోనూ భగీరథ్‌ ఆగడాల వల్ల ఇద్దరు యువతులు అభాసుపాలయ్యారని, ఆ బాధితులకు జరిగిన అన్యాయాన్ని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. 

హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ స్టేషన్‌(Hyderabad Cyber Crime Police)లో నమోదైన ఫిర్యాదు మేరకు, ఈ నెల 16న హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండి భగీరథ్‌ను కాపాడే ప్రయత్నంలో భాగంగా కొందరు వ్యక్తులు హైకోర్టు న్యాయమూర్తిపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టను  భంగం కలిగించే చర్య అని అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, టెక్నికల్ ఆధారాలతో రాయసం దామోదర్‌ను గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని, జాయింట్ సీపీ శ్వేత నాయకత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో మరో 15మందిపై కేసులు నమోదు అయ్యాయని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. 

ఈ సోషల్ మీడియా దాడుల వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందనే అనుమానంతో పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాధితుల వివరాలను బయటపెట్టడం ద్వారా వారిని భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరుగుతోంది. నిందితుడి తరఫున మద్దతుదారులు బాధితురాలి ఫొటోలు, వీడియోలు, ఆమె వ్యక్తిగత వివరాలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసి ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని సమాచారం. ఈ స్థాయిలో దుష్ప్రచారం చేయం వల్ల మిగతా బాధితులు భయపడి బయటకు రాకుండా అడ్డుకోవడమే వీరి ప్రధాన ఉద్దేశమని న్యాయ నిపుణులు అనుమానిస్తున్నారు. 

సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని కేసులను ప్రభావితం చేయాలనుకోవడం నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. బాధితులు మైనర్లు అయినప్పుడు వారి వివరాలను గోప్యంగా ఉంచాలనే రూల్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.              

Frequently Asked Questions

బండి భగీరథ్ పోక్సో కేసులో పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు?

న్యాయస్థానాన్ని ప్రభావితం చేసేలా, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించిన రాయసం దామోదర్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు?

బండి భగీరథ్ కేసులో హైకోర్టు న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారా?

అవును, ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, జాయింట్ సీపీ శ్వేత నాయకత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

సోషల్ మీడియా దాడుల వెనుక ఉద్దేశ్యం ఏమిటని భావిస్తున్నారు?

సోషల్ మీడియాలో బాధితుల వివరాలు బయటపెట్టడం ద్వారా వారిని భయబ్రాంతులకు గురిచేసి, ఇతర బాధితులు బయటకు రాకుండా అడ్డుకోవడమే ప్రధాన ఉద్దేశమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Thaman OG Tour Cancelled: హైదరాబాద్ రెయిన్స్ ఎఫెక్ట్... తమన్ ఓజీ టూర్ క్యాన్సిల్
హైదరాబాద్ రెయిన్స్ ఎఫెక్ట్... తమన్ ఓజీ టూర్ క్యాన్సిల్
Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
Hyderabad Techie Suicide: హైదరాబాద్‌లో ఆరో అంతస్తు నుంచి పసికందుతో దూకేసిన తల్లి! నిద్రలేమి సమస్యే ప్రాణం తీసిందా?
హైదరాబాద్‌లో ఆరో అంతస్తు నుంచి పసికందుతో దూకేసిన తల్లి! నిద్రలేమి సమస్యే ప్రాణం తీసిందా?
IMD Alert In Telangana And Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyberabad Police Gym Extortion: ఆ జిమ్ ట్రైనర్‌కుత్రీసమ్ ఫాంటసీ - లవర్ కూడా రెడీ - ఇద్దరూ కలిసి మహిళా పైలట్‌ను వేధించారు - చివరికి జైల్లో !
ఆ జిమ్ ట్రైనర్‌కుత్రీసమ్ ఫాంటసీ - లవర్ కూడా రెడీ - ఇద్దరూ కలిసి మహిళా పైలట్‌ను వేధించారు - చివరికి జైల్లో !
Jeedimetla Bangladeshi Nationals Arrested: హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
Night Routine Habits : మంచి నిద్రతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కావాలా? అయితే రాత్రుళ్లు చేయాల్సిన పనులు ఇవే
మంచి నిద్రతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కావాలా? అయితే రాత్రుళ్లు చేయాల్సిన పనులు ఇవే
Suriya Face Swap: ప్రభాసే కాదు... సూర్య కూడా దొరికేశాడు... ఇద్దరి సినిమాల్లో సేమ్ మిస్టేక్
ప్రభాసే కాదు... సూర్య కూడా దొరికేశాడు... ఇద్దరి సినిమాల్లో సేమ్ మిస్టేక్
Aishwarya Rajesh : విజయ్, అజిత్‌లను రీప్లేస్ చేయగలరా? - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
విజయ్, అజిత్‌లను రీప్లేస్ చేయగలరా? - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
Mancherial Latest News: బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్! ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వరాలు!
బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్! ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వరాలు!
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఘటనలో మరో ప్రాణం బలి - చికిత్స పొందుతూ కార్మికుడు సూరిబాబు మృతి
స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఘటనలో మరో ప్రాణం బలి - చికిత్స పొందుతూ కార్మికుడు సూరిబాబు మృతి
Bihar Mobile Tower Stolen: మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
Embed widget