News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

UPI in Gulf Countries: గల్ఫ్‌లోని ఇండియన్స్‌కి గుడ్‌న్యూస్! అక్కడా UPI వచ్చేస్తుందట?

UPI in Gulf Countries: గల్ఫ్ దేశాల్లోనూ యూపీఐ సేవలు విస్తరించేందుకు భారత్ చర్చలు జరుపుతోంది.

FOLLOW US: 
Share:

UPI in Gulf Countries: 

గ్లోబల్‌ సర్వీస్‌గా మార్చేందుకు ప్లాన్..

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. కరోనా తరవాత ఈ Transactions ఇంకా పెరిగాయి. ప్రపంచ దేశాల్లో చూస్తే...భారత్‌లోనే అత్యధికంగా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే National Payments Corporation of India (NCPI)కీలక విషయం వెల్లడించింది. గల్ఫ్‌ దేశాల్లోనూ యూపీఐ సర్వీస్‌ను విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది. ముఖ్యంగా సౌదీ అరేబియా, బహ్రెయిన్‌తో ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు స్పష్టం చేసింది. ఈ మధ్యే ఈ డిస్కషన్స్ మొదలైనట్టు వివరించింది. ఈ డీల్‌ విషయంలో గల్ఫ్ దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయట. గల్ఫ్ దేశాల్లో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. అక్కడ సంపాదించుకున్న డబ్బుల్ని పెద్ద మొత్తంలో సొంత దేశానికి పంపిస్తుంటారు. ఒకవేళ UPI సర్వీస్‌ అక్కడ కూడా విస్తరిస్తే...ఇండియన్స్‌కి ఇది చాలా హెల్ప్ అవ్వనుంది. NPCI చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బే దీనిపై స్పందించారు. ప్రస్తుతానికి ఆయా దేశాలతో చర్చలు జరుగుతున్నట్టు వివరించారు. 

"గల్ఫ్‌ దేశాలతో NPCI చర్చలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా UPI సేవలు విస్తరించాలని చూస్తున్నాం. అయితే తొలి దశలో బ్యాంక్ టు బ్యాంక్ లావాదేవీలకు ఈ సర్వీస్ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నాం. ఆయా దేశాల సెంట్రల బ్యాంక్‌లతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చర్చిస్తోంది. NCPIతో పాటు మరి కొన్ని సంస్థలు కూడా యూపీఐని విదేశాలకు విస్తరించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి"

- దిలీప్ అస్బే, NPCI చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ 

కీలక ఒప్పందాలు

ఈ ఏడాది సింగపూర్-భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. నేషనల్ పేమెంట్స్ సిస్టమ్స్‌ని అనుసంధానించాయి. యూపీఐని అడాప్ట్ చేసుకున్న తొలి దేశంగా భూటాన్‌ నిలిచింది. 2021లోనే ఈ దేశం ఈ సర్వీస్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తరవాత 2022లో నేపాల్‌ కూడా ఇదే బాటలో నడిచింది. అదే ఏడాది యూఏఈలోనూ ఇండియన్ ట్రావెలర్స్ యూపీఐతో చెల్లింపులు చేసేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. UAEలోనూ యూపీఐని విస్తరించే విషయంలో చర్చలు తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్స్‌తోనూ NRIలు యూపీఐ సర్వీస్‌ని వినియోగించుకునేలా భారత ప్రభుత్వం అనుమతించింది. సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్‌కాంగ్, ఒమన్, ఖతార్, యూఎస్, సౌదీ అరేబియా, యూఏఈ, యూకేలోనూ అనుమతి లభించింది. ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ల ఇంటర్నేషనల్ నంబర్స్‌తోనూ UPIతో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ...ఈ విషయంలో అన్ని దేశాలకూ సూచనలు చేశారు. UPIని విస్తరించడంలో సహకరించాలని పలు దేశాలను కోరారు. 

2016లో, దేశవ్యాప్తంగా ప్రతి రోజూ సగటున 2.28 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరగగా, ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 38 కోట్లకు పెరిగిందని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు. తాజా లెక్కల ప్రకారం, దేశంలో ప్రతిరోజూ సగటున 37.75 కోట్ల డిజిటల్ పేమెంట్స్‌ జరుగుతున్నాయి. వీటిలో సింహభాగం UPI ఆధారిత చెల్లింపులదే. కేవలం UPI లావాదేవీల ద్వారానే ప్రతిరోజూ దాదాపు 29.5 కోట్ల డిజిటల్ పేమెంట్స్‌ పూర్తవుతున్నాయి.

Also Read: Wrestlers Protest: బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసుల ఛార్జ్‌షీట్, పోక్సో కేసు రద్దు చేయాలని రిపోర్ట్

Published at : 15 Jun 2023 03:11 PM (IST) Tags: Saudi Arabia NPCI Bahrain UPI gulf countries Digital payments UPI Gulf

ఇవి కూడా చూడండి

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

గోధుమల నిల్వలపై కేంద్రం కఠిన ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణ కట్టడికి ప్రత్యేక చర్యలు

గోధుమల నిల్వలపై కేంద్రం కఠిన ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణ కట్టడికి ప్రత్యేక చర్యలు

Revanth Reddy open letter: చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy open letter: చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Anantapur Police Supended: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ

Anantapur Police Supended: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

టాప్ స్టోరీస్

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే