North Korea: బైబిల్‌తో కనిపించినందుకు రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు, జైల్లో చిత్రహింసలు - అక్కడ అంతే
North Korea: నార్త్ కొరియాలో బైబిల్‌తో కనిపించిన వారిని కిమ్ ప్రభుత్వం జైల్లో పెట్టి దారుణంగా హింసిస్తోంది.
North Korea on Christians:
క్రిస్టియన్స్‌పై దారుణాలు
నార్త్ కొరియా చట్టాలు ఎంత వింతగా ఉంటాయో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. సినిమాలు చూసినా, హెయిర్ కట్ సరిగ్గా చేయించుకోకపోయినా...శిక్షలు తప్పవు. అయితే...US State Department ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం...నార్త్ కొరియాలో క్రిస్టియన్‌లను తీవ్రంగా శిక్షిస్తున్నారు. ఎవరైనా సరే...చేతిలో బైబిల్‌తో కనిపిస్తే చాలు..వెంటనే జైల్లో తోసేస్తున్నారు. వాళ్లొక్కళ్లనే కాదు. మొత్తం కుటుంబ సభ్యులందరికీ శిక్ష విధిస్తున్నారు. International Religious Freedom Report 2022 ఈ సంచలన విషయం వెల్లడించింది. ఇప్పటి వరకూ నార్త్ కొరియాలో 70 వేల మంది క్రిస్టియన్స్‌ని జైల్లో వేశారని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. వీరిలో ఓ 2 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. బైబిల్‌తో కనిపించినందుకు ఆ చిన్నారికి కూడా జీవిత ఖైదు విధించింది కిమ్ ప్రభుత్వం. 2009లో ఈ చిన్నారి తల్లిదండ్రులు ప్రార్థనలు చేసుకుని బైబిల్ చేతుల్లో పెట్టుకుని కనిపించారు. అంతే. వెంటనే పోలీసులు వచ్చి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని జైలుకి పంపించారు. 2 ఏళ్ల చిన్నారి అని కూడా చూడకుండా...జీవిత ఖైదు విధించారు. ఇలా అరెస్ట్ అయిన వాళ్లంతా చిత్రహింసలకు గురవుతున్నారు. వీరందరికీ న్యాయం చేయాల్సిన అవసరముందని ఈ రిపోర్ట్ అభిప్రాయపడింది. మతపరమైన కార్యక్రమాలు చేసినా, ప్రార్థనలు చేసినా...నార్త్ కొరియా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోందని వివరించింది. ఇలా జైల్లో పెట్టిన వారిని దారుణంగా టార్చర్ చేస్తున్నారు. బలవంతంగా వారితో పనులు చేయిస్తున్నారు. మహిళలైతే లైంగిక వేధింపులూ ఎదుర్కొంటున్నారు.
అగ్రరాజ్యం ఆగ్రహం..
2021 డిసెంబర్‌లో Korea Future ఓ రిపోర్ట్ విడుదల చేసింది. నార్త్ కొరియాలో మత స్వేచ్ఛ లేకుండా పోయిందని, ముఖ్యంగా మహిళలను దారుణంగా హింసిస్తున్నారని తేల్చి చెప్పింది. బాధితుల్లో 151 మందిని పర్సనల్‌గా కలిసి ఇంటర్వ్యూ చేసి ఈ విషయం వెల్లడించింది. ఈ టార్చర్ తట్టుకోలేక కొందరు అక్కడి నుంచి పారిపోయారు. మరి కొందరు ఆ కూపంలోనే మగ్గిపోతున్నారు. అమెరికా, నార్త్ కొరియా మధ్య వైరం పెరుగుతున్న సమయంలో ఈ రిపోర్ట్ రావడం మరింత సంచలనమవుతోంది. దీనిపై ప్రపంచమంతా కచ్చితంగా దృష్టి సారించాలని గట్టిగా చెబుతోంది అగ్రరాజ్యం.
తండ్రి బాటలోనే కూతురు..
నార్త్ కొరియాలో పిల్లలందరూ స్కూళ్లకు వెళ్లి బుద్ధిగా చదువుకుంటున్నారు. ఒక్క అమ్మాయి తప్ప. ఆ అమ్మాయి మరెవరో కాదు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కూతురు. చాలా రోజుల పాటు ఆమె బయటి ప్రపంచానికి పరిచయం చేయలేదు కిమ్. గతేడాది ఓ సారి కూతురితో పాటు కనిపించాడు. ఇంటర్నేషనల్ మీడియా అంతా ఆ ఫోటోలను ప్రచురించింది. ఈమే కిమ్ కూతురు అంటూ పరిచయం చేసింది. అప్పటి నుంచి తరచూ నాన్నతో కలిసి కనిపిస్తూనే ఉంది ఆ అమ్మాయి. స్కూల్‌కెళ్లి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి...నాన్నతో పాటు పక్కనే ఉండి కొత్త మిజైల్ టెస్ట్‌ను దగ్గరుండి చూసుకుంటోంది. ఆమె వయసెంత..? ఈ అమ్మాయి కాకుండా కిమ్‌కి ఇంకెవరైనా పిల్లలున్నారా..? అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీయే. కానీ...ఈ అమ్మాయి మాత్రం రెగ్యులర్‌గా కిమ్‌తో కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: NITI Aayog Meeting: ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం,కేసీఆర్ సహా 7గురు సీఎంలు డుమ్మా