Nobel Prize 2021: డేవిడ్, ఆర్డెమ్‌కు వైద్య రంగంలో సంయుక్తంగా నోబెల్ బహుమతి
వైద్య విభాగంలో నోబెల్ బహుమతి -2021ని ప్రకటించారు. డేవిడ్ జులియస్, ఆర్డెమ్ పటాపౌటియన్కు సంయుక్తంగా అవార్డు లభించింది.
2021 ఏడాదికి గాను వైద్యశాస్త్రానికి సంబంధించిన నోబెల్ బహుమతిని ప్రకటించారు. డేవిడ్ జులియస్, ఆర్డెమ్ పటాపౌటియన్ను సంయుక్తంగా నోబెల్ బహుమతి వరించింది. వేడి, చలి, స్పర్శకు మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తుందనే అంశంపై వీరిద్దరూ పరిశోధనలు చేశారు.
2021 Nobel Prize in Physiology or Medicine awarded jointly to David Julius & Ardem Patapoutian “for their discoveries of receptors for temperature and touch.” pic.twitter.com/YFCDYZgZOW
— ANI (@ANI) October 4, 2021
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 4, 2021
The 2021 #NobelPrize in Physiology or Medicine has been awarded jointly to David Julius and Ardem Patapoutian “for their discoveries of receptors for temperature and touch.” pic.twitter.com/gB2eL37IV7
నోబెల్ కమిటీ సెక్రటరీ జనరల్ థామస్ పెర్ల్‌మన్ విజేతలను ప్రకటించారు.
ఉష్ణ గ్రాహకాలపై పరిశోధన కోసం మిరపకాయల్లోని కాప్సాయ్సిన్ అనే ఘాటైన పదార్థాన్ని డేవిడ్ ఉపయోగించారు. వేడికి ప్రతిస్పందించేలా చర్మంలో ఉండే సెన్సార్ను గుర్తించారు. ఇదే తరహాలో చర్మం, శరీరంలోని అవయవాలు స్పర్శకు ఎలా స్పందిస్తాయనే అంశంపై ఆర్డెమ్ పరిశోధన చేశారు.
ఈ అవార్డులో భాగంగా బంగారు పతకంతో పాటు దాదాపు 1.14 మిలియన్ల అమెరికన్ డాలర్లను బహుమతిగా ఇస్తారు. ఇదే ఈ ఏడాదిలో ప్రకటించిన మొదటి నోబెల్ బహుమతి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్రంపై త్వరలోనే బహుమతులు ప్రకటించనున్నారు.