By: Ram Manohar | Updated at : 21 Sep 2023 04:24 PM (IST)
భారత రాయబార కార్యాలయంపై దాడి చేసిన పది మంది ఖలిస్థాన్ వేర్పాటు వాదుల కోసం NIA గాలిస్తోంది. (Image Credits: ANI)
India Canada Tensions:
మార్చిలో కాన్సులేట్‌పై దాడి
ఈ ఏడాది మార్చి నెలలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్‌పై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడి చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అప్పటి నుంచే ఖలిస్థాన్ వేర్పాటువాదులు, భారత్ మధ్య ఘర్షణలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ అల్లర్లు అమెరికాతో పాటు కెనడాలోనూ మొదలయ్యాయి. ఇప్పుడవి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అయితే...ఈ అల్లర్లకు శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన దాడే ట్రిగ్గర్ పాయింట్‌గా మారింది. అందుకే...ఆ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించింది కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA). 10 మంది నిందితుల ఫొటోలనూ విడుదల చేసింది. వీళ్ల గురించి ఏ సమాచారం తెలిసినా వెంటనే తెలియజేయాలని ప్రజలను విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి మూడు నోటీసులు విడుదల చేసినట్టు NIA వెల్లడించింది. ఈ నిందితుల గురించి ఎవరు సమాచారం అందించినా వాళ్ల వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌లోనే ఈ ఘటనపై NIA కేసు నమోదు చేసింది. Unlawful Activities (Prevention) Act తో పాటు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. కానీ...వీళ్ల గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు.
ఖలిస్థాన్ నినాదాలు..
ఈ ఏడాది మార్చి 18,19వ తేదీల్లో భారత రాయబార కార్యాలయంపై ఈ దాడులు జరిగాయి. అక్రమంగా లోపలకి చొరబడిన ఖలిస్థాన్ వేర్పాటువాదులు నానా బీభత్సం సృష్టించారు. ఖలిస్థాన్ జెండాలతో నినాదాలు చేశారు. ఈ కార్యాలయం ప్రాంగణంలోనే ఖలిస్థాన్ జెండాలు పెట్టారు. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఈ దాడిని ఖండించింది. రాయబార కార్యాలయ భద్రతకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పింది. ఆ తరవాత కూడా ఖలిస్థాన్ మద్దతుదారులు రాయబార కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. లోపల సిబ్బంది ఉండగానే నిప్పంటించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై వెంటనే రావడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Top Headlines Today: టికెట్ ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉందన్న బుద్ధా వెంకన్న! ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్
ABP Desam Top 10, 10 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
WPL Auction 2024: వేలంలో ఏ ప్రాంచైజీ ఎవరిని దక్కించుకుందంటే?
TS LAWCET: టీఎస్ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!
గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి
Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?
ఛత్తీస్‌గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!
/body>