Nepal Missing Aircraft: నేపాల్ లో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యం, రంగంలోకి దిగిన ఆర్మీ
Nepal Missing Aircraft: నేపాల్ లో గల్లంతైన తారా ఎయిర్ లైన్స్ విమానం ఆచూకీ లభ్యమైంది. ముస్తాంగ్ జిల్లాలోని కోవాంగ్ గ్రామంలో విమానం కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
![Nepal Missing Aircraft: నేపాల్ లో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యం, రంగంలోకి దిగిన ఆర్మీ Nepal Army Mi-17 helicopter missing aircraft found Kowang of Mustang- Tribhuvan International Airport chief Nepal Missing Aircraft: నేపాల్ లో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యం, రంగంలోకి దిగిన ఆర్మీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/29/1fe628dea81329a0678bf39de35b18d9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నేపాల్ లో కనిపించకుండా పోయినా విమానం ఆచూకీ లభ్యమైంది. ఆదివారం ఉదయం సంబంధాలు కోల్పోయిన తారా ఎయిర్‌లైన్స్ చెందిన 9 NAET ట్విన్-ఇంజిన్ విమానం ముస్తాంగ్ జిల్లాలోని కోవాంగ్ గ్రామంలో కనుగొన్నారని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చీఫ్, ANIకు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్ స్టేటస్ ఇంకా తెలియాల్సి ఉందని ఎయిర్‌పోర్ట్ చీఫ్ సర్టర్ చెప్పారు. 22 మంది ప్రయాణికులు, సిబ్బందితో తారా ఎయిర్‌కు చెందిన 9 NAET ట్విన్-ఇంజిన్ విమానం ఆదివారం ఉదయం 9:55 గంటలకు పోఖారా నుంచి జోమ్‌సోమ్‌కు బయలుదేరింది. అయితే కాసేపటికే ఆ విమాన నుంచి అధికారిక సంబంధాలు తెగిపోయినట్లు వార్తా సంస్థ పేర్కొంది. 22 మంది ప్రయాణికులలో 4గురు భారతీయులు కాగా, 3గురు జపాన్ పౌరులు కాగా, మిగిలిన వారు నేపాల్ పౌరులుగా గుర్తించారు. స్థానికులు నేపాల్ ఆర్మీకి ఇచ్చిన సమాచారం ప్రకారం, తారా ఎయిర్ విమానం మనపతి హిమాల్ కొండల వద్ద లాంచే నది ముఖద్వారం వద్ద కూలిపోయింది. నేపాల్ ఆర్మీ సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆర్మీ అధికార ప్రతినిధి నారాయణ్ సిల్వాల్ తెలిపారు.
#UPDATE | Aircraft found at Kowang of Mustang. The status of the aircraft is yet to be ascertained: Tribhuvan International Airport chief
— ANI (@ANI) May 29, 2022
రంగంలోకి ఆర్మీ
"ఈ విమానం ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ప్రాంతంలో కనిపించింది. ఆ తరువాత మౌంట్ ధౌలగిరికి మళ్లించారు. ఆ తర్వాత దాని నుంచి కాంటాక్ట్ పోయింది" అని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేత్ర ప్రసాద్ శర్మ ANI కి చెప్పారు. “కనిపించకుండా విమానం కోసం పోఖారా నుండి రెండు ప్రైవేట్ హెలికాప్టర్లను పంపించామని నేపాల్ హోంమంత్రిత్వ శాఖ ముస్తాంగ్ తెలిపారు. నేపాల్ ఆర్మీ కూడా సెర్చ్ ఆపరేషన్ కోసం హెలికాఫ్టర్ ను మోహరించేందుకు సిద్ధమైందని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఫదీంద్ర మణి పోఖరేల్ చెప్పారని ANI నివేదిక పేర్కొంది. ఖాట్మండ్ పోస్ట్ ప్రకారం, జోమ్సన్ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, జామ్సన్ ఘాసాలో పెద్ద శబ్దం వచ్చిందని తమకు నివేదిక అందిందని తెలిపారు. విమానం అదృశ్యమైనట్లు తారా ఎయిర్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా ధృవీకరించారు. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామన్నారు.
ప్రయాణికుల ఆచూకీ!
నేపాలీ ఆర్మీ ప్రతినిధి నారాయణ్ సిల్వాల్ మాట్లాడుతూ "నేపాలీ ఆర్మీ Mi-17 హెలికాప్టర్ లేటే, ముస్తాంగ్‌కు బయలుదేరింది. కనిపించకుండా పోయిన తారా ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలినట్లు అనుమానిస్తున్నారు." ఈ విమానంలోని ప్రయాణికుల ఆచూకీపై ఇంకా ఎటువంటి సమాచారం అందలేదని ఎఎన్ఐ తెలిపింది.
భారతీయ ప్రయాణికులు : అశోక్ కుమార్ త్రిపాఠి, ధనుష్ త్రిపాఠి, రితికా త్రిపాఠి , వైభవి త్రిపాఠి
ఇతర ప్రయాణికులు: ఇంద్ర బహదూర్ గోలే, పురుషోత్తం గోలే, రాజన్ కుమార్ గోలే, మిక్ గ్రాట్, బసంత్ లామా, గణేష్ నారాయణ్ శ్రేష్ఠ, రవీనా శ్రేష్ఠ, రస్మి శ్రేష్ఠ, రోజినా శ్రేష్ఠ, ప్రకాష్ సునువార్, మకర్ బహదూర్ తమాంగ్, రమ్మయ తమంగ్, సుకుమాయ తమ్, సుకుమాయ తమ్ విల్నర్.
సిబ్బంది: కెప్టెన్ ప్రభాకర్ ఘిమిరే, కో-పైలట్ ఉత్సవ్ పోఖరేల్, ఎయిర్ హోస్టెస్ కిస్మి థాపా.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)