PM Security Breach: రైతులు ఏడాది ఎదురుచూశారు.. మీరు 15 నిమిషాలు వెయిట్ చేయలేరా?: సిద్ధూ
భద్రతా లోపాల వల్ల ప్రధాని పంజాబ్ పర్యటన రద్దు అయినట్లు వస్తోన్న వార్తలను కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఖండించారు.
![PM Security Breach: రైతులు ఏడాది ఎదురుచూశారు.. మీరు 15 నిమిషాలు వెయిట్ చేయలేరా?: సిద్ధూ Navjot Sidhu Questions PM Narendra Modi Amid Row Over Security Breach- Why These Double Standards PM Security Breach: రైతులు ఏడాది ఎదురుచూశారు.. మీరు 15 నిమిషాలు వెయిట్ చేయలేరా?: సిద్ధూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/904114c82009d7a08bfa1306048b105e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై రాజకీయ దుమారం చెలరేగింది. ఇందతా పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేసిన పనేనని భాజపా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. ప్రధాని మోదీ సానుభూతి కోసమే ఇదంతా చేశారని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు.
#WATCH Farmers sat on protest at Delhi borders for over a year,but yesterday when PM had to wait for around 15 mins he was troubled by it. Why these double standards? Modi Ji, you had said that you'll double farmers' income but you even took away what they had: Navjot Sidhu, Cong pic.twitter.com/qtflt4WmOI
— ANI (@ANI) January 6, 2022
ఈ వ్యవహారంపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని కోరింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అయితే భద్రతా వైఫల్యాల వల్లే ప్రధాని పర్యటన రద్దయిందనే వాదనను పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఖండించారు. అసలు ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో వస్తున్నారనే సమాచారమే తమకు అందలేదన్నారు. ప్రధాని పర్యటన రద్దు కావడంపై చింతిస్తున్నామన్నారు.
Also Read: PM Security Lapse: మోదీ- రాష్ట్రపతి భేటీ.. పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన
Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)